పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించలేం, కానీ: అమెరికా
వాషింగ్టన్: పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు లక్ష్యంగా పెట్టుకున్న దానికంటే ఐదురెట్లు ఎక్కువగా ఓట్లు వచ్చినప్పటికీ అమెరికా ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేకపోయింది. పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా గుర్తించలేమంటూ సదరు బిల్లును అమెరికా తోసిపుచ్చింది.
ఈ అంశానికి తాము మద్దతివ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. అయితే భారత్, పాక్‌లతో మంచి సంబంధాలను కలిగి ఉంటామని.. భారత్‌కు ముప్పు కలిగించే అంశాలపై పోరాడతామని సృష్టం చేసింది.
కాశ్మీర్ విషయంలో భారత్-పాక్ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను అర్థవంతమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం మాట్లాడారు.

పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలంటూ అమెరికా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారని.. పలు ఆన్‌లైన్ వినతులు కూడా వచ్చాయని వివరించారు. అయితే ఆ బిల్లులో ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదని అందుకే దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.
అదేవిధంగా కాశ్మీర్‌పై అమెరికా వైఖరి మారదని, ఇరుదేశాలు సామరస్యంగా చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని అమెరికా కోరుకుంటోందని అన్నారు. అదే సమయంలో అణ్వాయుధాలు ఉగ్రవాదుల బారిన పడకుండా పాకిస్థాన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత్, పాకిస్థాన్ తమ ప్రజల కోసమైనా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications