చైనాకు భారీ షాక్ -భారత్‌పై ట్రంప్ కుట్ర బద్దలు -వీటో ధిక్కారం -డిఫెన్స్ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీని ఆప్తమిత్రుడిగా పేర్కొంటూ ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్‌కు అనుకూలమైన బిల్లును వీటో చేయడం ద్వారా అసలు బుద్ధిని బటయపెట్టుకున్నారు. కానీ అధ్యక్షుడి వీటో అధికారాలను ధిక్కరించిమరీ అమెరికా కాంగ్రెస్ కీలకమైన డిషెన్స్ బిల్లుకు ఆమోదం తెలిపింది. భారత్ పట్ల చైనా వ్యవహరిస్తోన్న యుద్ధోన్మాద వ్యవహార శైలిని సదరు బిల్లు తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే..

చైనా దూకుడుు కళ్లెం..
భారత్ చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 9 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దులో తుపాకి పేలుళ్లు, రక్తపాతం చోటుచేసుకున్నాయి. తూర్పు లదాక్ కేంద్రంగా రెచ్చిపోతోన్న డ్రాగన్ బలగాలు.. ఇండియాతో కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా అమెరికా ప్రభుత్వం కీలక బిల్లును రూపొందించింది. కానీ ఆ బిల్లును అధ్యక్షుడు ట్రంప్ తనకున్న విశేష అధికారాలతో వీటో చేశారు. అయినాసరే..

ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్
తూర్పు లదాక్ లో భారత్ పట్ల ఉన్మాద వైఖరితో వ్యవహరిస్తోన్న తీరును అమెరికా కాంగ్రెస్ ఖండించింది. భారత్ పట్ల దురాక్రమణ ధోరణితో వ్యవహరిస్తున్న చైనా తీరును ఖండించే ఈ నిబంధనతో కూడిన చట్టానికి అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదం తెలిపింది. భారత్-చైనా అంశంతోపాటు మొత్తం 740 బిలియన్ డాలర్ల ఖర్చుతో కూడిన డిఫెస్స్ పాలసీ బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. నిజానికి ఈ బిల్లును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటో చేశారు. కానీ ఇప్పటికే ఆయన పదవీ కాలం చివరి దశలో ఉన్నందున సదరు వీటోను పక్కనపెట్టిమరీ కాంగ్రెస్ ఈ బిల్లును ఆమోదించడం గమనార్హం. అమెరికా చరిత్రలోనే అరుదైన ఈ సంఘటనను ‘చివరి రోజుల్లో ట్రంప్ కు తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బ'గా మీడియా అభివర్ణించింది. ఈ బిల్లులో..

ఇండియాపై దురాక్రమణ వద్దంటూ..
అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించిన ‘నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డీఏఏ), 2021' ప్రకారం.. భారత్ చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కయ్యానికి కాలు దువ్వే సైనిక చర్యలను మానుకోవాలని చైనాకు అమెరికా హితవు పలికింది. అధ్యక్షుడి వీటో అధికారాన్ని తిరగరాసేందుకు సెనేట్‌లో మూడొంతుల మంది సభ్యుల ఆమోదం తప్పనిసరి. అందుకనుగుణంగా.. 81-13 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ సభ్యులు కూడా ఆయన వీటోను తోసిపుచ్చడం గమనార్హం. ఎన్‌డీఏఏలో దేశ భద్రతకు నష్టం కలిగించే నిబంధనలు ఉన్నాయంటూ ట్రంప్ దీనిని వ్యతిరేకించారు. చివరికి ఆయన మాట చెల్లుబాటు కాకుండా పోయింది. ఈ సందర్భంగా..

రాజా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు
డిఫెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కీలక ప్రసంగం చేశారు. సెనేట్‌లో జరిగిన న్యూ ఇయర్స్ డే ఓటింగ్‌లో నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ చట్టంగా మారిందని గుర్తుచేస్తూ.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్‌తోపాటు ఇతర దేశాలపట్ల చైనా దురాక్రమణపూరితంగా వ్యవహరిస్తోన్న తీరుకు ముగింపు పలకాలని కృష్ణమూర్తి అన్నారు. తాను ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత దేశంతోపాటు ఇతర దేశాలపై చైనా దురాక్రమణ ధోరణి ఆమోదయోగ్యం కాదన్నారు. అమెరికన్ కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఆమోదించడం ద్వారా భారత దేశానికి, ఇతర భాగస్వాములకు మద్దతు, సంఘీభావాలను ప్రకటిస్తున్నట్లు స్పష్టమైన సందేశాన్ని పంపిందని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ట్రంప్ పాలన ముగియనున్న నేపథ్యంలో.. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే..

భారత్-చైనా చర్చలకు బ్రేక్
గతేడాది మే నుంచి ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో గత జూన్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోవడం తెలిసిందే. సరిహద్దు వెంబడి కీలక ప్రాంతాలపై భారత సైన్యం పట్టు సాధించి, చైనా సైన్యం దూకుడుకు కళ్లెం వేసింది. డ్రాగన్ సైతం భారీగా సైన్యాలను, యుద్ధసామాగ్రిని సరిహద్దులకు తరలించి వేడిని కొనసాగిస్తున్నది. సరిహద్దులో ఉద్రిక్తతలు తొలగిపోయేలా, తూర్పు లదాక్ ప్రతిష్టంభనకు తెరదించేలా భారత్, చైనా సైనిక అధికారుల మధ్య జరగాల్సిన కీలక చర్చలకు బ్రేక్ పడింది. రెండు దేశాల సైనికాధికారుల మధ్య తొమ్మిదో విడత చర్చలు జరగాల్సి ఉండగా ఇప్పటివరకూ ఆ దిశగా ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు.చైనాలో ఇటీవల చోటుచేసుకున్న కమాండర్ల మార్పే ఇందుకు కారణమని తెలుస్తోంది. చైనాతో చర్చల విషయంలో సకారాత్మక పరిణామాలేవీ లేవని సాక్ష్యాత్తూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దంపడుతోంది.
సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి