అమెరికా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్లే ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం: బ్రిటన్ ప్రధాని బోరిస్
లండన్: ఆఫ్ఘనిస్తాన్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న తాలిబన్ల ఆక్రమణ.. దాదాపు ముగిసినట్టే. ఒక్కో నగరాన్ని, ప్రావిన్స్‌ను స్వాధీనం చేసుకుంటూ వచ్చిన తాలిబన్లు రాజధాని కాబుల్‌ను ఆక్రమించేసుకోవడంతో వారి దండయాత్ర చివరిదశకు చేరింది. ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే మిగిలి ఉంది. అధికార మార్పడి దాదాపు ఖాయమైంది.

చేతులెత్తేసిన ఆఫ్ఘన్ ప్రభుత్వ బలగాలు..
అనూహ్యంగా, శరవేగంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్య పరుస్తోన్నాయి. కనీస ప్రతిఘటన అనేది కూడా లేకుండా ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ బలగాలు చేతులెత్తేయడం నివ్వెర పరుస్తోంది. దాదాపు 20 సంవత్సరాలుగా అమెరికా సైనిక బలగాలు అక్కడ మోహరించి ఉండటం వల్ల తాలిబన్లు ఏ మాత్రం కూడా ప్రభావాన్ని చూపలేకపోయారు. తమకు అనుకూలంగా ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే వారు పరిమితం అయ్యారు.

20 ఏళ్లుగా అమెరికా అండ..
ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుందో.. అప్పటి నుంచే తాలిబన్లు పేట్రేగిపోయారు. తమ దురాక్రమణను ఆరంభించారు. కాబుల్ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటూ వచ్చారు. అమెరికా అండ లేని ఆప్ఘన్ ప్రభుత్వ బలగాలు ఏ మాత్రం ప్రతిఘటించలేెకపోయాయి. 20 సంవత్సరాలుగా అమెరికా సైన్యం అండగా ఉన్న సమయంలో ఏ మాత్రం కూడా శక్తి, సామార్థ్యాలను పెంపొందించుకోలేకపోయాయి.

అమెరికా నిర్ణయం వల్లే..
ఈ పరిణామాలపై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ స్పందించారు. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎంతో సమయం పట్టదని స్పష్టం చేశారు. తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలంటూ అమెరికా తీసుకున్న ఆ ఒకే ఒక్క నిర్ణయంతోనే ఆ దేశం తాలిబన్ల వశమైందని పేర్కొన్నారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేకపోవచ్చని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షికపరంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరూ గుర్తించకూడదని ఆయన చెప్పారు.

కఠినంగా వ్యవహరించక తప్పదు..
తాలిబన్ల ప్రభుత్వంపై పాశ్చాత్య దేశాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. నాటో, ఐక్యరాజ్య సమితితో కలిసి ఉమ్మడిగా ఆప్ఘన్‌లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వాన్ని నిరోధించుకోవాల్సి ఉంటుందని అన్నారు. క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా మారే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనను బోరిస్ జాన్సన్ వ్యక్తం చేశారు. అల్లకల్లోలానికి గురైన ఆఫ్ఘన్ నుంచి బ్రిటన్ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకుని రావడానికి రౌండ్ ద క్లాక్ పనిచేస్తోన్నామని చెప్పారు.

ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘన్..
దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లడంతో.. అక్కడి ప్రభుత్వం కుప్పకూలినట్టయింది. తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. అధికార మార్పిడి సజావుగా సాగడానికి మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా, ముజాహిదీన్ మాజీ నాయకుడు గులాబుద్దీన్ హెక్‌మట్యార్‌తో కూడిన ఓ సమన్వయ కమిటీ ఏర్పాటైం
Recommended Video

రక్తపాతం లేకుండా..
రక్తపాతానికి ఏ మాత్రం అవకాశం లేకుండా అధికార బదలాయింపు సజావుగా సాగడానికి ఉద్దేశించిన కోఆర్డినేషన్ కమిటీ ఇది. తాలిబన్ల ప్రతినిధులతో చర్చించి.. ప్రభుత్వాన్ని వారి చేతుల్లో అప్పగించాలనేది ఈ కమిటీ ఆలోచన. మాట వినకుంటే బుల్లెట్‌ను దింపే తాలిబన్లు.. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను పట్టించుకుంటాయా? అనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ కోఆర్డినేషన్ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేకపోవడం వల్ల తాలిబన్లు ఏకపక్షంగానే నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications