వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రరాజ్యంలో రేపే పోలింగ్: ఎఫ్‌బీఐ దిమ్మ తిరిగేలా: గన్ కల్చర్: భారీగా తుపాకుల కొనుగోళ్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల కోలాహలం పతాక స్థాయికి చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ ఆరంభం కాబోతోంది. అధ్యక్ష స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే విషయాన్ని అమెరికన్లు డిసైడ్ చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్.. తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేదా అనేది తేలిపోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్.. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోండగా.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ఆయనకు ఎలాంటి పోటీ ఇచ్చారనేది స్పష్టం కానుంది.. మంగళవారం నాటి పోలింగ్‌తో.

Recommended Video

US Election 2020 : Biden Leads Trump ఆ రాష్ట్రాల్లో జో బైడెన్ కు మెజారిటీ ఓట్లు..!!

డొనాల్డ్ ట్రంప్ కోటలో బిడెన్ పాగా? అప్పర్ మిడ్ ఈస్ట్ రాష్ట్రాల్లో మారిన గాలి: లీడ్‌లో జోడొనాల్డ్ ట్రంప్ కోటలో బిడెన్ పాగా? అప్పర్ మిడ్ ఈస్ట్ రాష్ట్రాల్లో మారిన గాలి: లీడ్‌లో జో

గన్ కల్చర్ కంటిన్యూ..

గన్ కల్చర్ కంటిన్యూ..

ఈ పరిణామాల మధ్య అమెరికాలో ఒక్కసారిగా తుపాకుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా తుపాకులను కొనుగోలు చేయడానికి అమెరికన్లు పెద్ద ఎత్తున దరఖాస్తులను దాఖలు చేశారు. వాటికి ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీ) అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తుపాకుల కొనుగోళ్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు దాఖలు కావడం ఎఫ్‌బీఐ అధికారులను నివ్వెరపరుస్తోంది. పోలింగ్ సందర్భంగా హింసాత్మక పరిస్థితులు చెలరేగడానికి అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తోందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఎన్నికల నెలలో 29 మిలియన్ల దరఖాస్తులు..

ఎన్నికల నెలలో 29 మిలియన్ల దరఖాస్తులు..


కరోనా వైరస్ వ్యాప్తి ఆరంభమైన తొలి రోజులతో పోల్చుకుంటే.. అధ్యక్ష ఎన్నికల చివరి నెలలో తుపాకుల కొనుగోళ్ల కోసం భారీగా దరఖాస్తులు అందినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో తుపాకుల కోసం 3.7 మిలియన్ల మేర దరఖాస్తులు అందాయి. జూన్‌లో ఈ సంఖ్య 3.9 మిలియన్లకు చేరుకుంది. సెప్టెంబర్‌లో ఏకంగా 28.8 మిలియన్లకు పెరిగింది. ఈ సంఖ్య గత ఏడాది ఇదే నెలలో దాఖలైన దరఖాస్తులకు మించిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తుపాకుల కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో 28.4 మిలియప్ల దరఖాస్తులు దాఖలు కాగా.. ఈ సంఖ్య 28.8కి పెరిగింది.

తొలిసారిగా తుపాకుల కోసం దరఖాస్తు చేసుకున్న వారే..

తొలిసారిగా తుపాకుల కోసం దరఖాస్తు చేసుకున్న వారే..

తమకు గన్‌లు కావాంటూ తొలిసారిగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యే అత్యధికంగా ఉంటోంది. గన్ కోసం తొలిసారిగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యలో 40 శాతం పెరుగుదల కనిపించినట్లు నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫౌండేషన్ వెల్లడించింది. వారిలో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మద్దతుదారులు అధికంగా ఉన్నట్లు ధృవీకరించింది. 2016లో అధ్యక్ష ఎన్నికల నెలలో తుపాకుల కోసం 27.5 మిలియన్ల దరఖాస్తులు అందాయని, ఈ సారి ఆ సంఖ్య 28.8 మిలియన్లకు పెరిగిందని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు.

కొత్త అసోసియేషన్లు..

కొత్త అసోసియేషన్లు..


ఇదివరకు ఎప్పుడూ లేనంతగా కొత్తగా గన్ అసోసియేషన్లు పుట్టుకొస్తున్నాయని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. సోషలిస్ట్ రైఫిల్ అసోసియేషన్, ఆఫ్రికన్ అమెరికన్ గన్ అసోసియేషన్ వంటివి కొత్తగా ఏర్పడ్డాయని, ఆయా సంఘాల తరఫున పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలు అయ్యాయని తెలిపారు. షాట్‌గన్, పిస్టల్‌ల కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను సరళీకరించడం వల్ల వాటికి డిమాండ్ పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఫలితంగా బుల్లెట్ల ధరలూ పెరిగాయి. ఇదివరకు 50 రౌండ్ల బుల్లెట్లు 15 డాలర్లు ఉండగా.. వాటి ధర ప్రస్తుతం 40 డాలర్లకు చేరుకుంది.

English summary
A rising number of Americans are doing the same, buying guns for the first time, in the midst of widespread protests, a polarised country and a pandemic, all of which have added to the tension leading up to the November 3 presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X