డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ బిడెన్: రేస్ టు 270: పీఠం ఎవరిది? అగ్రరాజ్యంలో ఏం జరగబోతోంది?
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి రేస్ ఆరంభమైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెయిల్ ద్వారా ఓటుహక్కును వినియోగించే వీలు కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ దశలవారీగా ఇదివరకే ఆరంభమైంది. పోలింగ్ డే నాడు లక్షలాది మంది వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా ఓటు వేయబోతున్నారు.
Recommended Video

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రీ ఎలక్షన్ ప్రక్రియ ఆరంభం..
అధికారాన్ని అందుకోవడానికి 270 సీట్లను సంపాదించాల్సి ఉండగా.. ఈ రేస్‌లో డొనాల్డ్ ట్రంప్ వెనుకంజలో ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. ఫ్లోరిడాలో ప్రీ ఎలక్షన్ ఓట్ల పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 24వ తేదీ నాడే ఆరంభమైంది. ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ (ఈఎస్టీ) ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ప్రీ-ఎలక్షన్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. వాటి ఫలితాలనే తొలుత వెల్లడిస్తారు.

వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు విధానాల్లో..
జార్జియాలో అక్టోబర్ 19వ తేదీన పోలింగ్ ప్రకియ ఆరంభమైంది. స్లిప్పులపై సంతకాల ద్వారా ఓటింగ్ ఉంటుంది. వాటిని స్కాన్ చేసి పంపిస్తారు. ఈఎస్టీ టైమ్ ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ వెంటనే వాటి లెక్కింపును చేపడతారు. టెక్సాస్‌లో అత్యధిక ఓట్లు ఉన్న ప్రాంతాల్లో ప్రీ ఎలక్షన్ ఓట్ల పోలింగ్ ప్రక్రియ అక్టోబర్ 22న ఆరంభమైంది. మెయిల్ ద్వారా వేసిన ఓట్లు బుధవారం (నవంబర్ 4) నాటికి పంపించాల్సి ఉంటుంది.

తొమ్మిది రాష్ట్రాల్లో..
తక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో ప్రీ ఎలక్షన్ పోలింగ్.. కిందటి నెల 30వ తేదీన ప్రారంభమైంది. ఈ ప్రాంతాలకు సంబంధించిన బ్యాలెట్లు.. మంగళవారం నాటికి పంపించాల్సి ఉంటుంది. నార్త్ కరోలినా స్టేట్‌లో సెప్టెంబర్ 12వ తేదీన, ఓహియోలో అక్టోబర్ 6వ తేదీన ప్రీ ఎలక్షన్ ఓట్ల ప్రక్రియ ప్రారంభమైంది. వాటి లెక్కింపు మంగళవారం సాయంత్రం చేపడతారు. అరిజోనాలో ప్రీ ఎలక్షన్ ప్రక్రియ అక్టోబర్ 20న ప్రారంభమైంది. విస్కాన్సిన్, మిచిగాన్‌లల్లో సోమవారం ఈ ప్రక్రియను చేపట్టారు.

డెమొక్రాట్లకే మద్దతా?
నిర్దేశిత గడువు ముగిసే సమయానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియాలో ఈ ప్రక్రియ మంగళవారమే ఆరంభమౌతుంది. పోలింగ్ డే నాడే కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటిదాకా నమోదైన ఈ తొమ్మిది రాష్ట్రాల ప్రీ ఎలక్షన్ ప్రక్రియలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. ట్రంప్‌పై ఆయన స్వల్ప ఆధిక్యతను సాధించినట్లు పేర్కొన్నాయి.

టఫ్ ఫైట్..
2016 ఎన్నికల సందర్భంగా ఈ తొమ్మిదింట్లో అయిదు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు మెజారిటీ ఓట్లను సాధించినట్లు తెలిపాయి. ఈ సారి బిడెన్‌కు ఆయా రాష్ట్రాల్లో ఆధిక్యతను లభించిందని, మిగిలిన చోట్ల ఇదే పరిస్థితి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి కోసం 270 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవాల్సి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్-జో బిడెన్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications