అచ్చు మిషెల్లీ స్పీచ్ లాగే..! ట్రంప్ భార్య కాపీ స్పీచ్

Subscribe to Oneindia Telugu

అమెరికా : ట్రంప్ సతీమణి, మాజీ మోడల్ మెలినియా (46) ఇచ్చిన స్పీచ్ కాపీ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో తన పరిచయ ప్రసంగమిచ్చిన మెలినియా.. అచ్చు మిషెల్లీ ఒబామా స్పీచ్ నే కాపీ కొట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ట్రంప్ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నందునా..రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ఆయన సతీమణి మెలినీయా ప్రసంగించారు. ఈ సందర్భంగా తన భర్తను ఓ సమర్థవంతమైన నాయకుడిగా అభివర్ణించిన ఆమె.. ఒక భర్తగా, తండ్రిగా, నాయకుడిగా ట్రంప్ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రసంగించారు.

US election: Melania Trump 'plagiarised' Michelle Obama

ఇదంతా బాగానే ఉన్నా.. తన వ్యక్తిగత జీవితంలో నిర్దేశించుకున్న కొన్ని విలువల గురించి ప్రస్తావించిన మెలీనియా, మిషెల్లీ స్పీచ్ నే దించేశారన్న ఆరోపణ ఎదుర్కొంటుంది. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ పార్టీ తరుపున ప్రసంగించిన మిషెల్లీ ఒబామా ఉపన్యాసాన్ని తలపించపేలా మెలినీయా ప్రసంగం సాగడంతో ఆమెది ప్రసంగం కాస్త విమర్శల పాలవుతోంది.

తన ప్రసంగంలో కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. తల్లిదండ్రులు నేర్పిన సామాజిక నైతిక విలువలు, ఎదుటివారిని గౌరవించడం, హామిలకు కట్టుబడి ఉండడం వంటివి ఎప్పటికీ తాను పాటిస్తానని చెప్పుకొచ్చారు మెలీనియా. అయితే ఇవే విషయాలను గతంలో మిషెల్లీ ఒబామా తన ప్రసంగంలో ప్రస్తావించడంతో మెలినీయా ఉపన్యాసం కాపీ అని తేలిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump's wife, Melania, took centre stage on the first day of the Republican National Convention but faced accusations that a portion of her speech plagiarised Michelle Obama.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి