వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ ఎన్నికల ఫలితాల వేళ .. పారిస్ ఒప్పందం నుండి అధికారికంగా వైదొలగిన అమెరికా

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తారన్న సంకేతాలతో డోనాల్డ్ ట్రంప్ కుట్ర జరుగుతోంది అంటూ సుప్రీం కోర్టుకు వెళతాం అంటూ పేర్కొన్నారు అంతేకాదు ఎన్నికల్లో తాము గెలవబోతున్నాం అంటూ భారీగా సంబరాలు చేసుకుందాం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇదే సమయంలో అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయాలలో ఒకటైన పారిస్ ఒప్పందం నుండి అమెరికా నేడు బయటకు వచ్చేసింది. పారిస్ వాతావరణ ఒప్పందం నుండి అధికారికంగా వైదొలిగిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అమెరికా నిలిచింది.

US election results .. ఫ్లోరిడాలో తలక్రిందులైన అంచనాలు .. జార్జియా, ఒహైయోలోనూ ట్రంప్ ముందంజUS election results .. ఫ్లోరిడాలో తలక్రిందులైన అంచనాలు .. జార్జియా, ఒహైయోలోనూ ట్రంప్ ముందంజ

ప్యారిస్ ఒప్పందం నుండి అమెరికా బయటకు .. ఎన్నికల ఫలితాల రోజు యాదృచ్చికం

ప్యారిస్ ఒప్పందం నుండి అమెరికా బయటకు .. ఎన్నికల ఫలితాల రోజు యాదృచ్చికం

2017 లో ట్రంప్ ప్యారిస్ ఒప్పందం నుండి బయటకు రావాలని నిర్ణయం తీసుకుంటే, అది ఇంతకాలానికి నేడు యాదృచ్చికంగా అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నాడే అమల్లోకి వచ్చింది. పారిస్ ఒప్పందాన్ని 2015 లో ప్రారంభించారు .ఈ ఒప్పందం గ్లోబలైజేషన్ ను తగ్గించడం కోసం , వాతావరణంలో వచ్చే పెను మార్పులను అడ్డుకోవడం కోసం, కాలుష్యాన్ని నివారించాలని అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందం. ముఖ్యంగా భూతాపాన్ని రెండు సెంటీ గ్రేడ్లు తగ్గించాలన్నది దీని ప్రధాన లక్ష్యం.

2017లో పారిస్ ఒప్పందం నుండి వైదొలగాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ట్రంప్

2017లో పారిస్ ఒప్పందం నుండి వైదొలగాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ట్రంప్

అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 2017వ సంవత్సరంలో పారిస్ ఒప్పందం నుండి వైదొలగాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ .ఇది అమెరికా దేశంపై ఉన్న కఠినమైన ఆర్థిక భారానికి ముగింపు అని కూడా ఆ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంలోని క్లిష్టమైన ఐక్యరాజ్య సమితి నిబంధనల కారణంగా అధికారికంగా ఒప్పందం నుండి వైదొలగడానికి ఇంత కాలం పట్టింది. అమెరికా వంటి అగ్రదేశాలు ఈ ఒప్పందం నుండి ఒక్కసారిగా బయటకు వెళితే కష్టమౌతుంది కాబట్టి ఒప్పందంలో కఠినమైన నిబంధనలు విధించారు.

 నేటి నుండి అధికారికంగా యూఎస్ పారిస్ ఒప్పందంలో లేనట్టే

నేటి నుండి అధికారికంగా యూఎస్ పారిస్ ఒప్పందంలో లేనట్టే

బయటకు వెళ్లిపోవాలనుకున్న దేశం మూడేళ్ల తర్వాత వైదొలిగేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే అనుకోకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్న రోజే గడువు కాలం ముగియటం సంభవించింది. దీంతో నేటి నుండి అమెరికా పారిస్ ఒప్పందం నుంచి అధికారికంగా బయటకు వచ్చినట్లేనని తెలుస్తుంది. యుఎస్ ఒప్పందం అమెరికన్ ప్రజలపై పన్ను భారం కాదని , భారీ సంపద బదిలీ అసలే కాదని క్లింటన్ మరియు జార్జ్ డబ్ల్యు బుష్ పరిపాలనలలో ప్రధాన స్టేట్ డిపార్ట్మెంట్ క్లైమేట్ సంధానకర్తగా ఉన్న క్లైమేట్ అడ్వైజర్స్ సిఇఒ నిగెల్ పూర్విస్ చెప్పారు.

 పారిస్ ఒప్పందంపై తప్పుగా ట్రంప్ ప్రకటన .. జో బైడెన్ వస్తే మళ్ళీ ఒప్పందంలో చేరే ఛాన్స్ !!

పారిస్ ఒప్పందంపై తప్పుగా ట్రంప్ ప్రకటన .. జో బైడెన్ వస్తే మళ్ళీ ఒప్పందంలో చేరే ఛాన్స్ !!

వాస్తవానికి, ఈ ఒప్పందం ఎటువంటి దేశానికి ఎటువంటి ఆర్థిక చెల్లింపులు చేయవలసిన అవసరం లేదన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ప్యారిస్ ఒప్పందాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ, ఒప్పందం నుండి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక యూఎస్ ఎన్నికల ఫలితాలు తరువాత జో బైడెన్ అధ్యక్షుడైతే తిరిగి పారిస్ ఒప్పందం లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అమెరికా మళ్ళీ పారిస్ ఒప్పందంలో చేరాలనుకుంటే చేరే అవకాశం ఉంది .

English summary
After a three-year delay, the US has become the first nation in the world to formally withdraw from the Paris climate agreement.President Trump announced the move in June 2017, but UN regulations meant that his decision only takes effect today, the day after the US election.The US could re-join it in future, should a president choose to do so.The Paris deal was drafted in 2015 to strengthen the global response to the threat of climate change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X