వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US elections 2020: చెత్తబుట్టలో ట్రంప్... ఓ మ్యూజియం నిర్వాకం .. ప్రజా తీర్పు ఇలాగే ఉంటుందా ?

|
Google Oneindia TeluguNews

డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో నువ్వానేనా అన్నట్టుగా సత్తా చాటటానికి రెడీ అయిన వేళ ఊహించని పరిణామం ట్రంప్ కు షాక్ ఇచ్చింది . ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఓటర్లు తీర్పుపై ఆసక్తి కనబడుతున్న వేళ , జర్మనీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం సంచలన నిర్ణయం తీసుకుంది .

US elections 2020:అధ్యక్ష పదవిని రియాల్టీ షో చేశారు..ట్రంప్ పై ఫైర్.. బైడెన్ కు మద్దతుగా బరాక్ ఒబామాUS elections 2020:అధ్యక్ష పదవిని రియాల్టీ షో చేశారు..ట్రంప్ పై ఫైర్.. బైడెన్ కు మద్దతుగా బరాక్ ఒబామా

 డొనాల్డ్ ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేసిన మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం

డొనాల్డ్ ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేసిన మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం


అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం యొక్క బెర్లిన్ శాఖ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేశారు. సోషల్ మీడియాలో చెత్తబుట్టలో ఉన్న ట్రంప్ విగ్రహాన్ని, యూ ఆర్ ఫైర్డ్. ‘ఫేక్ న్యూస్', ‘ఐ లవ్ బెర్లిన్' వంటి ప్లకార్డులు ప్రదర్శించారు . అంతేకాదు చెత్తలో ట్రంప్ మైనపు విగ్రహాన్ని ఉంచి డంప్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ ను చెత్తలో పడేస్తే అమెరికా మళ్ళీ గొప్ప దేశం అవుతుంది అంటూ ప్లకార్డులు ప్రదర్శన గావించారు .

చెత్తబుట్టలోట్రంప్... భవిష్యత్ పరిణామాలకు చిహ్నమన్న మ్యూజియం నిర్వాహకులు

చెత్తబుట్టలోట్రంప్... భవిష్యత్ పరిణామాలకు చిహ్నమన్న మ్యూజియం నిర్వాహకులు


మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో మైనపు బొమ్మలు ఏర్పాటు చేయటాన్ని చాలా మంది ప్రతిష్టాత్మకంగా భావిస్తారు . అలాంటి మ్యూజియం ఇలా ఎన్నికల సమయంలో ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్త బుట్టలో పడేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మైనపు విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేసే నిర్ణయం భవిష్యత్ పరిణామాలకు చిహ్నమని మ్యూజియం యొక్క మార్కెటింగ్ మేనేజర్ ఆర్కిడ్ యాల్సిండాగ్ చెప్పారు.
ఈ కార్యాచరణ యునైటెడ్ స్టేట్స్ ఎన్నికలకు ముందు ప్రతీక అని పేర్కొన్నారు .

డోనాల్డ్ ట్రంప్ విగ్రహం తొలగింపు .. ఇదే అమెరికన్ల ఆకాంక్ష అంటూ స్పష్టం

డోనాల్డ్ ట్రంప్ విగ్రహం తొలగింపు .. ఇదే అమెరికన్ల ఆకాంక్ష అంటూ స్పష్టం

మేడమ్ టుస్సాడ్స్ బెర్లిన్ మ్యూజియం డోనాల్డ్ ట్రంప్ యొక్క మైనపు విగ్రహాన్ని తొలగించి ఈ ఎన్నికల్లో ఇలాంటి ఫలితమే రావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు .అమెరికా ఎన్నికల్లో మా ఆకాంక్ష ఇదే అంటూ స్పష్టం చేశారు . డోనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఉపయోగించుకోవడం ఇదే మొదటిసారి కాదు. మ్యూజియం తరపున కొన్ని సార్లు ప్రకటనలు చేయడం కోసం, తాము చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టం చేయడం కోసం ఇలా క్రమం విగ్రహాన్ని వాడుకుంటోంది.

 ఏది చెప్పాలన్నా వినూత్న స్టైల్ లో చెప్పే మ్యూజియం

ఏది చెప్పాలన్నా వినూత్న స్టైల్ లో చెప్పే మ్యూజియం

డోనాల్డ్ ట్రంప్ పరిపాలన తీరుపై తమ అసహనాన్ని ఆయన మైనపు విగ్రహాన్ని చెత్త బుట్టలో పడేసి వ్యక్తం చేసిన మ్యూజియం నిర్వాహకులు, ప్రజా తీర్పు కూడా ఇదే విధంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇంతకుముందు కూడా ప్రజలందరూ మాస్కులు ధరించాలని చెప్పడం కోసం, రంగు విగ్రహానికి మాస్కు తొడిగి అందరూ ఇలానే మాస్కులు ధరించాలని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రచారం చేసింది.

అమెరికాలో కరోనా కల్లోలం సృష్టించడం, లక్షలాదిగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడం, డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా పరిస్థితి ఈ విధంగా మారిందని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు జో బైడెన్ కు అనుకూలంగా వస్తాయని భావిస్తున్నారు.

Recommended Video

US Election 2020 : Electoral College Is Key Factor,All you Need to Know| #USpresidentialpolls
మ్యూజియం చేసిన పనే ఎన్నికల్లో ప్రజలు చేస్తారా ?

మ్యూజియం చేసిన పనే ఎన్నికల్లో ప్రజలు చేస్తారా ?

తాజాగా జరిగిన సర్వేలు, ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా నమోదవుతున్న ముందస్తు ఓటింగ్ సరళి అన్ని ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు గా స్పష్టమౌతుంది. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీల మధ్య హోరా హోరీ గా పోటీ ఉన్న స్థానాల్లో కూడా ప్రజలు బైడెన్ వైపు మొగ్గు చూపటం ట్రంప్ ఓటమికి సంకేతంగా భావిస్తున్నారు . మ్యూజియం ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్తలో పడేసినట్టు ప్రజలు కూడా తమ తీర్పుతో ట్రంప్ ను అధ్యక్ష పీఠం నుండి క్రిందికి దించి విసిరి కొడతారా అన్నదే ఉత్కంఠగా మారింది.

English summary
the Berlin branch of Madame Tussauds Wax museum placed the wax figure of President Donald Trump into a dumpster when US elections are being conducted . Pictures on social media showed the statue in a dumpster surrounded by “You’re fired!”, ‘fake news’, ‘I love Berlin’ tweets. Several trash bags accompanied the wax figure in the bin, which was centred in front of a Trump Tower backdrop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X