ఇరాన్ పై అమెరికా ప్రత్యక్ష యుద్ధం: భారీగా బాంబింగ్: ట్రంప్ సంచలన ప్రకటన
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 10 రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టింది. ఇరాన్ లోని మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్ అణు స్థావరాలు- ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది అమెరికా.

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన అధికారిక ట్రూత్ సోషల్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ మిషన్ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించారు ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ సహా ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సాగించిన వైమానిక దాడులు విజయవంతం అయ్యాయని తెలిపారు.
పూర్తి పేలోడ్ తో ఇరాన్ అణు కేంద్రాలపై తాము దాడులు చేశామని స్పష్టం చేశారు. ఫోర్డో, నాటాంజ్, ఇస్పహాన్ లల్లో అత్యంత శక్తిమంతమైన బాంబులను జారవిడిచాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయా యుద్ధ విమానాలన్నీకూడా సురక్షితంగా తిరుగుముఖం పట్టాయని చెప్పారు.
కాగా- ఈ దాడుల కోసం 2బీ2 బాంబర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి. 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబుతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లు మాత్రమే ఫోర్డో వంటి అణు కేంద్రాలను ధ్వంసం చేయగలవని చెబుతున్నారు.

ఈ దాడుల పట్ల ఇరాన్ ఘాటుగా స్పందించింది. అణు కేంద్రాలపై దాడులకు తాము తీర్చుకునే ప్రతీకారం అత్యంత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో అమెరికా జోక్యం చేసుకోవడం చాలా ప్రమాదకరమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ సిటీ నటాంజ్ విధ్వంసానికి గురైంది. నటాంజ్ సిటీలోని అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించింది ఇజ్రాయెల్. అలాగే ఫోర్డో, టెహ్రాన్ చుట్టూ ఉన్న ఇతర వ్యూహాత్మక ప్రదేశాలనూ తుత్తునీయలు చేసింది. ఈ ఆపరేషన్‌లో 200కు పైగా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను వినియోగించింది.












Click it and Unblock the Notifications