భారతీయుల విసాల మీద పడ్డ ట్రంప్: డ్యురేషన్ ఆఫ్ స్టేటస్

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో చోటు చేసుకుంటోన్న మార్పులు.. భారతీయ విద్యార్థులను దెబ్బకొడుతున్నాయి. వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారుస్తోన్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులే అధికంగా బలి అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చదువుకోవడానికి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. స్టూడెంట్స్ విసాల్లో పెను మార్పులను తీసుకొచ్చాయి ఈ రెండు శాఖలు. సంస్కరణలకు తెర తీశాయి.

US has proposed fixed visa terms for students

ఇప్పుడు మరో కొత్త నిబంధనలను ప్రతిపాదించింది అమెరికా. విద్యార్థులు, విదేశీ జర్నలిస్టులకు సంబంధించి కొత్త వీసా నిబంధనల్లో భారీగా సవరణలు చేసింది. డ్యురేషన్ ఆఫ్ స్టేటస్ ను అమలులోకి తీసుకుని రానుంది. ఎన్ని రోజులైనా అమెరికాలో నివసించవచ్చనే రూల్ ను తొలగించింది. కొత్తగా నిర్దుష్ట గడువును విధించబోతోంది.

అమెరికాలో విదేశీ విద్యార్థులు, సాంస్కృతిక మార్పిడి కింద తమ దేశానికి వచ్చే విదేశీ సందర్శకులు, జర్నలిస్టుల వీసా కాలపరిమితిని పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం కొత్త నియమాలను ప్రతిపాదించింది. దీని ద్వారా వారి విసా పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. విసా దుర్వినియోగాన్ని తగ్గించడమే దీని ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు.

బుధవారం విడుదలైన ఈ నియమావళి వల్ల ప్రస్తుతం అమలులో ఉన్న డ్యురేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని పూర్తిగా తుడిచిపెట్టినట్టవుతుంది. దీని స్థానంలో నిర్ణీత వీసా గడువును ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం ఎఫ్ వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, జే వీసాలపై ఉన్న సాంస్కృతిక మార్పిడి కార్మికులు, ఐ వీసాలపై ఉన్న విదేశీ జర్నలిస్టులకు నిర్దుష్ట కాలపరిమితి వర్తిస్తుంది.

2024లో అమెరికాలో దాదాపు 1.6 మిలియన్ల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఎఫ్ వీసాలపై ఉన్నారు. అలాగే- సుమారు 3,55,000 మంది కల్చరల్ ఎక్స్ఛేంజ్ విజిటర్స్, 13,000 మంది జర్నలిస్టులు ఉన్నట్లు తేలింది. ఇప్పుడీ విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదన ప్రకార- స్టూడెంట్స్, కల్చరల్ ఎక్స్చేంజ్ వీసాలకు నాలుగు సంవత్సరాల గరిష్ట కాలపరిమితి విధిస్తారు. విదేశీ జర్నలిస్టులకు 240 రోజులు, చైనా జాతీయులకు 90 రోజులు మాత్రమే అమెరికాలో నివసించే గడువు ఉంటుంది. గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విదేశీ విద్యార్థులు, ఇతర వీసా హోల్డర్లను అమెరికాలో దాదాపు నిరవధికంగా ఉండేందుకు అనుమతించాయని, ఇది భద్రతాపరమైన ఇబ్బందులను సృష్టించిందని అన్నారు. ఈ విధానం వల్ల అమెరికా పౌరులకు నష్టం కలిగించిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+