రష్యాపై జో బైడెన్ కీలక ప్రకటన: తక్షణమే అమలు: ఇంచ్ భూమిని కూడా

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి. అనేక ఆంక్షలను విధించాయి. ఆర్థికపరమైన కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడిని అంతర్జాతీయ వేదికల మీద తప్పుపడుతున్నాయి. పాశ్చాత్య దేశాలన్నీ తనకు వ్యతిరేకంగా నిలిచినప్పటికీ- రష్యా మాత్రం వెనుకంజ వేయట్లేదు. పైగా తన యుద్ధ తీవ్రతను పెంచింది. రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుంది.

Recommended Video

    Russia Ukraine Conflict : Russia కు చెందిన ప్రైవేట్ Aircrafts ను సీజ్ చేసిన America | OneindiaTelugu

    కీవ్‌పై భారీగా దాడులు..

    కీవ్‌పై భారీగా దాడులు..

    రష్యా సైనిక బలగాలు- ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పూర్తిస్థాయిలో దండెత్తాయి. రాకెట్లు, మిస్సైళ్లతో దాడులను నిర్వహిస్తోన్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను సంధిస్తోన్నాయి. ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న కొద్దీ.. రష్యా బలగాలు మరింత రెచ్చిపోతున్నాయి. కీవ్‌ను మరింత సమీపించాయి. ఈ నగరాన్ని హస్తగతం చేసుకునే దిశగా కదులుతున్నాయి. ఏ క్షణమైనా కీవ్ నగరంలోకి చొచ్చుకుని వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

    అమెరికా మరిన్ని ఆంక్షలు..

    అమెరికా మరిన్ని ఆంక్షలు..

    ఈ పరిణామాలతో అమెరికా- తన ఆంక్షల తీవ్రతను మరింత పెంచింది. తాజాగా రష్యా విమానాలు రాకపోకలను సాగించడానికి విల్లేకుండా చేసింది. తమ దేశ గగనతలాన్ని మూసివేసింది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌లోని పలు సభ్య దేశాలు ఈ చర్యలకు దిగాయి. తమ తమ దేశాల గగనతలాన్ని రష్యా విమానాల కోసం మూసివేశాయి. ఇప్పుడు తాజాగా అమెరికా కూడా ఆ దేశాలతో జత కలిసింది. ఫలితంగా- రష్యన్ విమానాలేవీ అమెరికా గగనతలం మీదుగా రాకపోకలు సాగించలేవు.

     స్టేట్ ఆఫ్ ది యూనియన్‌లో ప్రసంగం..

    స్టేట్ ఆఫ్ ది యూనియన్‌లో ప్రసంగం..

    స్టేట్ ఆఫ్ ది యూనియన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించారు. కీలక అంశాలను ప్రస్తావించారు. యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు తాము కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సీజ్ చేస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్‌ సైన్యం రష్యాను నిలువరించగలుగుతోందని, ఆ దేశ పౌరులు సైతం తుపాకులను చేతబట్టుకోవడమే దీనికి నిదర్శనమని చెప్పారు.

    పుతిన్ మూల్యం చెల్లించుకోక తప్పదు..

    పుతిన్ మూల్యం చెల్లించుకోక తప్పదు..

    ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ప్రభావం.. రష్యా, ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను సుదీర్ఘకాలం పాటు వెంటాడుతుందని అన్నారు. ఈ యుద్ధంలో పుతిన్ గెలిచినా.. ఓడిపోయినా.. ఆ తీసుకున్న సైనిక చర్య వల్ల ప్రపంచంలోని మెజారిటీ దేశాలను దూరం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. యుద్ధ ట్యాంకులు, సైనిక బలగాలతో కీవ్‌ను చుట్టుముట్టినప్పటికీ- ఆ దేశ ప్రజల హృదయాలను మాత్రం ఎప్పటికీ గెలవలేరని అన్నారు.

     నాటో టెర్రిటరీని ఆక్రమించుకోలేరు..

    నాటో టెర్రిటరీని ఆక్రమించుకోలేరు..

    నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లోని సభ్య దేశాలకు చెందిన ఇంచ్ భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని జో బైడెన్ స్పష్టం చేశారు. దురాక్రమణదారులను సమర్థవంతంగా తిప్పికొట్టే శక్తిసామర్థ్యాలు నాటో సభ్య దేశాల సొంతమని వ్యాఖ్యానించారు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని కల్పించే ఉద్దేశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. నాటో సభ్య దేశాలు తమ ఉమ్మడి శతృవును ఐక్యంగా ఎదుర్కొంటాయని, దీనికోసం ఎంతవరకైనా వెళ్తాయని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+