మహిళలను అందుకు వినియోగించింది: అమెరికా లిక్కర్ కంపెనీ వారసురాలుకు 25 ఏళ్ల జైలు శిక్ష

అమెరికా: అమెరికాలో ప్రముఖ లిక్కర్ కంపెనీ సీగ్రాం వారసురాలు క్లేర్ బ్రోన్ఫ్‌మ్యాన్‌పై వచ్చిన ఆరోపణలు నిజేమనని ఆమె ఒప్పుకున్నారు. తన ఆర్థిక లాభాల కోసం కుట్రపూరిత మార్గాల్లో కొందరు వలస దారులైన మహిళలను వ్యభిచార కూపంలోకి దించేదని క్లేర్ ఒప్పుకున్నారు. అయితే క్లేర్ పై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి వలసదారులైన మహిళలను లైంగిక బానిసలుగా మార్చినందుకు మరొకటి తప్పుడు గుర్తింపు పత్రాలు సృష్టించినందుకు నమోదయ్యాయి.

ఇక ఇదే కేసుకు సంబంధించి కేత్ రానియర్ అనే వ్యక్తిపై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. స్వయంసహాయక బృదం పేరుతో ఏర్పాటు చేసిన క్సివిం అనే సంస్థలో మహిళలను లైంగిక బానిసలుగా మార్చడం, అతర్వాత బలవంతంగా పనులు చేయించుకోవడంలాంటి ఆరోపణలు కేత్ రానియర్‌పై నమోదయ్యాయి. గతేడాది మెక్సికోలో రానియర్ అరెస్టయ్యాడు. క్లేర్‌పై ఆరోపణలు రుజువు కావడంతో ఆమెకు 25 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆమెకు 27 నెలల వరకు మాత్రమే శిక్ష పడుతుంది. ఆ తర్వాత ఎన్నేళ్లు శిక్ష విధించాలనేదానిపై జూలై 25న వాదనలు జరగనున్నాయి.

US liquor heiress found Guilty in sex cult case,faces 25 years jail

రానియర్ స్వయంసహాయక బృందం క్సివిం నడిచేందుకు ఆర్థికంగా క్లేర్ సహాయం చేసేదనే ఆరోపణలున్నాయి. ఇక రానియర్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా ఆరోపణలు రుజువయ్యాయి. ఇ:దులో అల్లిసన్ మాక్ అనే బుల్లితెర నటి కూడా ఉంది. మహిళలను లైంగిక బానిసలుగా మార్చడంలో ఈమె పాత్ర కూడా ఉన్నట్లు రుజువైంది. కొన్ని బడా కంపెనీ యజమానుల వద్దకు ఈ మహిళలను పంపి వారితో శృంగారంలో పాల్గొనేలా పురమాయించేవారని విచారణలో వెలుగుచూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+