సంచలన తీర్పు: వృద్దురాలిపై లైంగిక దాడి చేసినందుకు 100ఏళ్ల జైలు!

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడిన 23ఏళ్ల యువకుడికి.. అమెరికా కోర్టు 100ఏళ్ల జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. 2015, కొత్త సంవత్సరం రోజున టెవిన్ రైనీ అనే యువకుడు చికాగోకు 40కి.మీ దూరంలోని వెస్ట్ మాంట్ లో ఉన్న అపార్ట్ మెంట్ లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో వృద్దురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటంతో.. తొలుత ఆమెను లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత తుపాకీతో బెదిరిస్తూ.. సమీపంలోని ఏటీఎం వద్దకు తీసుకెళ్లాడు. ఆపై డబ్బులు విత్ డ్రా చేసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.

US man sentenced to 100 years for sexually assaulting 85-year-old woman

ఇన్నాళ్లు దీనిపై విచారణ కొనసాగగా.. తుది విచారణ చేపట్టిన కోర్టు.. టెవిన్‌ను దోషిగా తేల్చింది.
వృద్ధురాలిని లైంగికంగా వేధించినందుకు 60 ఏళ్లు, తుపాకీతో బెదిరించి దోపిడీ చేసినందుకు మర 40ఏళ్ల శిక్ష విధించింది. మొత్తంగా టెవిన్ 100ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young man from the US state of Illinois was sentenced to 100 years in prison after he was convicted of sexually assaulting and robbing an 85-year-old woman, officials said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి