Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ పై ట్రంప్ కొరడా - ట్రావెల్ ఏజెన్సీలకు షాక్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తోన్న ఏ ఒక్కడ్నీ వదలట్లేదు. వెంటాడుతున్నారు. చాలామందిని ఇప్పటికే చేతికి బేడీలు వేయించి మరీ వాళ్ల దేశానికి పంపించారాయన. ఇప్పుడు దీన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టారు.

అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పౌరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అక్రమ వలసదారులను రాడికల్స్‌గా, టెర్రరిస్టులుగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు.

US plans Visa Restrictions on Indian travel agencies

అలాంటి వాళ్లు అమెరికా గడ్డపై నివసించడానికి ఏ మాత్రం అర్హులు కారనీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి అప్పట్లో. ఇప్పుడు దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా- అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేశారు.

నాన్ అమెరికన్లకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌ ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికారు. అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలనూ పంపించారు. అటు ఇష్టానుసారంగా టారిఫ్ పెంపుదల, ఇటు అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోండటంతో భారత్ సహా అనేక దేశాలకు ఇబ్బందికరంగా పరిణమించింది.

ఈ క్రమంలో అక్రమ వలసదారులను మృతులుగా ప్రకటించడానికీ వెనుకాడలేదు డొనాల్డ్ ట్రంప్. గతంలో 6,000 మందిని మృతుల జాబితాలో చేర్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సోషల్ సెక్యూరిటీ నంబర్లను రద్దు చేసింది అప్పట్లో. ఫలితంగా వారికి ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా తలుపులు మూసివేసింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి బెనిఫిట్స్ వారికి అందకుండా అడ్డుకుంది.

అక్రమ వసలదారులను అడ్డుకునే క్రమంలో ఇప్పుడు తాజాగా మరోసారి కొరడా ఝుళిపించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు అక్రమ వలసలను ఉద్దేశపూరకంగా పంపిస్తోన్నారనే కారణంతో భారత్ లోని ట్రావెల్ ఏజెన్సీలపై ఆంక్షలను విధించనున్నట్లు ప్రకటించింది. ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, ఎగ్జిక్యూటివ్స్, ప్రతినిధులపై విసా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది.

అక్రమ వలసలు, మనుషుల అక్రమ రవాణా, దానికి సంబంధించిన కార్యకలాపాలను భారత ట్రావెల్ ఏజెన్సీలు సులభతరం చేస్తోన్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి మిషన్ ఇండియా కాన్సులర్ వ్యవహారాలు, డిప్లొమేటిక్ సెక్యూరిటీ సర్వీసెస్, రాయబార- కాన్సులేట్‌ కార్యాలయాలు సమన్వయంతో పనిచేస్తాయని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికాకు అక్రమ వలసలను సులభతరం చేసినందుకు భారత్ లోని ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, ఎగ్జిక్యూటివ్స్, ఇతర ప్రతినిధులపై వీసా పరిమితులు విధించడానికి చర్యలు తీసుకుంటోన్నామని స్పష్టం చేసింది. అక్రమ వలసల వల్ల సంభవించే విపత్కర పరిస్థితుల గురించి విదేశీ పౌరులకు తెలియజేసేలా తమ ఇమ్మిగ్రేషన్ విధానం ఉంటోందని వివరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+