ట్రంప్ ఇలా తగులుకున్నాడు ఏంటి రా బాబు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమాయకులు చనిపోతున్నప్పటికీ, భారత్ చౌకగా ఇంధనం కొనుగోలు చేస్తూ రష్యాకు ఆర్థిక సహాయం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు.
భారత్ చమురు కొనుగోలు చేయడమే రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి కారణమని, యుద్ధం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్, తన తాజా వ్యాఖ్యలతో మరోసారి ఉద్రిక్తతలను పెంచారు.

ఇదే సమయంలో, అమెరికా అధ్యక్షుడి సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాతో భారత్ నిజాయితీగా వ్యవహరించడం లేదని, తమను మిత్రదేశంగా చెప్పుకుంటూనే అమెరికా వస్తువులను ఆమోదించకుండా భారీ సుంకాలను విధిస్తోందని మిల్లర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications