డొనాల్డ్ ట్రంప్ కు నరాల బలహీనత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యానికి గురయ్యారు. తన అధికారిక నివాసం వైట్ హౌస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటోన్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ వెల్లడించింది. 79 సంవత్సరాల ట్రంప్ ఆరోగ్యంపై అప్ డేట్ ను విడుదల చేసింది. ఫలితంగా కొన్ని అధికారిక కార్యక్రమాలు రద్దయినట్లు తెలిపింది.

ట్రంప్ కాళ్ల వాపుతో బాధపడుతున్నారు. ఆయనకు దీర్ఘకాలిక సిరల బలహీనత (Chronic Venous Insufficiency) ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపిన వివరాల ప్రకారం- వైట్ హౌస్ మెడికల్ టీమ్ తాజాగా ట్రంప్ ను వైద్య పరీక్షలను నిర్వహించింది. కాంప్రహెన్సివ్ డయాగ్నొస్టిక్, వాస్కులర్ స్టడీ చేపట్టింది.

US President Donald Trump has examined these health issues

ఇందులో భాగంగా ట్రంప్ కు డాప్లర్ అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించగా- దీర్ఘకాలిక సిరల బలహీనత ఉన్నట్లు తేలింది. ఇది సాధారణంగా 70 సంవత్సరాలకు పైనున్న వారిలో కనిపిస్తుంటుందని కరోలినా లెవిట్ పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ట్రంప్ కాళ్లల్లో వాపు చోటు చేసుకుంటోండటంతో తాజా వైద్య పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు.

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కు సంబంధించిన ఆధారాలు లేవని వైట్ హౌస్ మెడికల్ టీమ్ చీఫ్ డాక్టర్ బార్బెల్లా వెల్లడించినట్లు లెవిట్ తెలిపారు. ట్రంప్ ల్యాబ్ రిపోర్టులన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయని అన్నారు. ట్రంప్ ఎకో- కార్డియోగ్రామ్ కూడా చేయించుకున్నారు. గుండె వైఫల్యం, మూత్రపిండాల బలహీనత లేదా ఇతర వ్యవస్థాగత అనారోగ్య లక్షణాలు ఏవీ లేవని వివరించారు.

సిరలలోని కవాటాలు సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తం బ్లాక్ అవడం వల్ల తరచూ కాళ్లల్లో వాపు కనిపిస్తుంటుంది. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 1,50,000 మంది ఈ వ్యాధి బారిన పడుతుంటారు. వయస్సు పెరిగే కొద్దీ దీని ప్రమాద తీవ్రత పెరుగుతుంటుంది. కాళ్లల్లో వాపు, నొప్పి, తిమ్మిర్లు, సిరలు ఉబ్బటం, చర్మం పాలిపోవడం వంటివి.. ఈ వ్యాధి లక్షణాలు.

ఇది వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యగా లెవిట్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో ఇది సాధారణం. అధిక బరువు, శారీరక శ్రమ చేయకుండా ఎక్కువసేపు కూర్చుని లేదా నిలబడి చేస్తూ ఉంటే వారికి దీర్ఘకాలిక సిరల బలహీనత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+