ఆ వ్యవహారాలపై ట్రంప్ తీవ్ర అసహనం
US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలన జరుపుకొంటోన్నారు. ఈ ఏడాది 20వ తేదీన ఆయన ఆ దేశ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 100 రోజుల పాలన సందర్భంగా టాప్ మీడియా హౌస్ ఏబీసీ న్యూస్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వార్తల్లోకెక్కింది.
ఏబీసీ న్యూస్ జర్నలిస్ట్ టెర్రీ మోరాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ గురించి టెర్రీ మోరాన్ అడిగిన ప్రశ్న.. ట్రంప్‌ను అసహనానికి, ఆగ్రహానికి గురి చేసింది. టెర్రీ వేసిన ప్రశ్నను స్టుపిడ క్వశ్చన్‌గా అభివర్ణించారు ట్రంప్. ఈ ఇంటర్వ్యూని పూర్తి చేస్తామని నాకు 100 శాతం నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.

ట్రంప్ 100 రోజుల పాలనలో ఎన్‌క్రిప్టెడ్ సిగ్నల్ యాప్ వినియోగం, పెంటగాన్‌లో కొనసాగుతున్న మార్పుల గురించి ట్రంప్‌ను ప్రశ్నించారు టెర్రీ మోరాన్. ఈ మార్పుల విషయంలో హెగ్సెత్‌ను మందలించారా? అంటూ మోరాన్ అడిగారు. దానికి ట్రంప్ తొలుత ఆచితూచి స్పందించారు. హెగ్సెత్‌తో మాట్లాడానని, ఆ సంభాషణ సారాంశాన్ని మీడియాకు తెలియజేయడానికి ఇష్టపడట్లేదని తేల్చి చెప్పారు.
హెగ్సెత్‌లో టాలెంట్ ఉందని, యువకుడు- తెలివైనవాడు- బాగా చదువుకున్నాడని ట్రంప్ ప్రశంసించారు. ఆయన గొప్ప రక్షణ కార్యదర్శి అవుతారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. హెగ్సెత్ శక్తి సామర్థ్యాలపై వంద శాతం నమ్మకం ఉందా అంటూ మోరాన్ గుచ్చి గుచ్చి ప్రశ్నించడం ట్రంప్‌ను ఆగ్రహానికి గురి చేసింది.
తనకు దేనిపైనా 100 శాతం నమ్మకం లేదని, ఈ ఇంటర్వ్యూ కూడా వంద శాతం పూర్తి చేస్తానో లేదో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. ఇదొక స్టుపిడ్ క్వశ్చన్ అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడితో ఇంటర్వ్యూ చేసే జీవితకాల అవకాశాన్ని ఇచ్చానని, దీన్ని సద్వినియోగం చేసుకుందామని మోరాన్‌కు హితబోధ చేశారు ట్రంప్.
ఒకదశలో సహనం కోల్పోయిన డొనాల్డ్ ట్రంప్.. ఇంటర్వ్యూ చేస్తోన్నారనే స్పృహ ఉందా? అని టెర్రీ మోరాన్‌ను ప్రశ్నించారు. ఈ ఇంటర్వ్యూ కోసం మిమ్మల్నే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా?, మీ పేరును ఎప్పుడూ వినలేదు, అయినా సరే. జీవితకాల అవకాశాన్ని ఇచ్చాను. దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు.. అని మోరాన్‌పై ఎదురుదాడికి దిగారు.












Click it and Unblock the Notifications