Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వింతగా ప్రవర్తించిన జో బైడెన్: దిక్కులు చూస్తూ..

US President Joe Biden: ఇటలీ వేదికగా.. ప్రతిష్ఠాత్మక జీ7 దేశాల సదస్సు ఏర్పాటైంది. ఈ సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. మూడో విడత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత విదేశీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి.

జీ7లో భారత్‌కు సభ్యత్వం లేదు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్.. మాత్రమే ఇందులో కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఆహ్వానితుడిగా భారత్ తరఫున మోదీ ఇందులో పాల్గొనబోతోన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉక్రెయిన్ అధ్యక్షులు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సహా పరిమితంగా ఎంపిక చేసిన దేశాల అధ్యక్షులు ఉన్నారు.

US President Joe Biden was captured on video appearing to wandering off in Italy

ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు ఈ భేటీ కొనసాగనుంది. ఇందులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైెడెన్, ఇమ్మానుయెల్ మాక్రాన్, బ్రిటన్, కెనడా ప్రధానమంత్రులు రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఇదివరకే ఇటలీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనికి అధ్యక్షత వహిస్తారు.

ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాను మరింత కట్టడి చేయడం, ఆ దేశం ఆక్రమించిన అనేక ప్రాంతాల విముక్తి కల్పించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పించడంపైనా చర్చిస్తారు. జీ7 దేశాల మధ్య వాణిజ్య పరమైన పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.

సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని సందర్శించారు ఆయా దేశాధినేతలు. వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి ఎటూ చూస్తూ నిల్చున్నారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఉన్నట్టు ప్రవర్తించారు. కుడి చెయ్యి పైకి ఎత్తి వారిని పలకరించడం కనిపించింది.

దీన్ని గమనించిన మెలోనీ.. మెల్లిగా జో బైడెన్ వద్దకు వెళ్లి ఆయన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగారు. దీనితో బైడెన్ తేరుకుని, మళ్లీ వారితో జత కట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాను ఆ దేవుడే కాపాడాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+