భీకర యుద్ధం వేళ..జో బైడెన్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.
ఈ దాడులను హమాస్ తిప్పి కొడుతోంది. టెల్ అవివ్ సహా పలు నగరాలపై మోర్టార్లను సంధిస్తోంది. ఈ నెల 7వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో 4,000 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
భారత్ సహా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్.. వంటి దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు అండగా నిలిచాయి. అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులతో సంభాషించారు. ఈ యుద్ధాన్ని నివారించడంలో మధ్యవర్తిత్వం వహించడానికి రష్యా ముందుకొచ్చింది.
ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన అంటే బుధవారం జో బైడెన్.. ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. టెల్ అవివ్‌లో బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అవుతారు.
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటొని బ్లింకెన్ తెలిపారు. జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనాల్లోనూ బైడెన్ పర్యటిస్తారని చెప్పారు. ఆయా దేశాల అధ్యక్షులు కింగ్ అబ్దుల్లా 2 బిన్ అల్-హుస్సేన్, అబ్దెల్ ఫటా ఎల్-సిసి, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌లను కూడా కలుస్తారని వివరించారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications