భారత్ కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్-మోడీ ఫ్రెండే కానీ..దెబ్బకు దెబ్బ తీస్తాం..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై విషం కక్కారు. అమెరికాపై భారత్ విధిస్తున్న పన్నుల్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు అక్కడి నుంచే భారత్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే భారత్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో కూడా ట్రంప్ తేల్చిచెప్పేశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో భారతీయుల పాత్ర కచ్చితంగా కీలకంగా మారబోతోంది.

విదేశీ వస్తువులపై భారత్ విధిస్తున్న పన్నుల వల్ల అమెరికా ఆర్ధిక వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద పన్ను విధింపుదారుగా మారిందని ట్రంప్ ఆక్షేపించారు. దీనికి కౌంటర్ గా తాను అధికారంలోకి వస్తే వారిపై రెసిప్రోకల్ ట్యాక్స్ (పరస్పర పన్ను) విధిస్తామని డెట్రాయిట్ లో జరిగిన ప్రధాన ఆర్ధిక విధాన చర్చలో హెచ్చరించారు.

US Presidential Election 2024 Donald trump warns india to levy reciprocal tax against its tariffs

తాము విదేశీ వస్తువులపై సాధారణంగా పన్నులు విధించబోమని, కానీ తన హయాంలోనే ఈ ప్రక్రియ మొదలైందని ట్రంప్ గుర్తుచేసారు. కానీ చైనా తమపై 200 శాతం సుంకాన్ని వసూలు చేస్తుందని, బ్రెజిల్ కూడా భారీగా పన్నులు వసూలు చేస్తోందని ఆరోపించారు. అన్నింటికంటే పెద్ద ఛార్జర్ భారతదేశం అన్నారు. భారత్‌తో తమకు గొప్ప సంబంధాలు ఉన్నాయంటూనే, మోడీ గొప్ప నాయకుడంటూనే, కానీ వారు ఎక్కువగా పన్నులు వసూలు చేస్తున్నారంటూ ట్రంప్ ఆక్షేపించారు.

తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ట్రంప్ ఇవాళ మాత్రం రూటు మార్చారు. మోడీ తనకు స్నేహితుడంటూనే ఆయన పన్నుల విషయంలో ఓ కిల్లర్ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన హయాంలో 'హౌడీ మోదీ' కార్యక్రమానికి హాజరయ్యేందుకు 2019లో మోదీ హ్యూస్టన్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్.. ఇప్పుడు మాత్రం పన్నుల విషయంలో ఆయన్నూ టార్గెట్ చేయడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+