వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబిడెన్.. ట్రంప్‌ను మట్టికరిపించిన డెమొక్రటిక్ అభ్యర్థి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే 10 కోట్ల మంది అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. మరో 6 కోట్ల మంది ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అమెరికా ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనూ ఇదో రికార్డు.ఇక అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే రిగ్గింగ్ జరిగే ఆస్కారం ఉందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికాను కరోనా భయం పట్టి పీడిస్తుండటంతో ముందస్తుగానే చాలామంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి భారతీయులు కూడా ముందస్తు ఓటింగ్‌లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందస్తు ఓటింగ్‌ను యాబ్సెంట్ బ్యాలెట్‌గా పిలుస్తారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. ఈ రోజు జరిగే ఎన్నికలతో ట్రంప్ మరియు జో బిడెన్‌ల భవితవ్యం తేలనుంది. సాధార‌ణంగా పూర్తి ఫ‌లితాలు రావాలంటే కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. కానీ పోలింగ్ జ‌రిగిన మ‌రుస‌టి రోజే దాదాపు విజేత ఎవ‌రో ఖాయం అవుతుంది. అయితే ఈసారి పూర్తి ఫ‌లితాల ప్ర‌క‌ట‌న మాత్రం కొన్ని రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఈసారి పోస్ట‌ల్ బ్యాలెట్ల సంఖ్య పెర‌గ‌డం వ‌ల్ల‌.. వాటి లెక్కింపు ఆల‌స్యం అవుతుంద‌ని అధికారులు ఇప్ప‌టికే ఒక ప్రకటన చేశారు.

US Presidential Elections 2020 live updates:Tough fight between Trump and Biden

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
2:27 PM, 9 Nov

అధికార పగ్గాలు అధికారికంగా బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నియమించిన అమెరికా సాధారణ పరిపాలనా అధికారిని కోరిన జో బిడెన్ బృందం
2:23 PM, 9 Nov

జో బిడెన్‌కు అధికారం బదిలీ చేసేందుకు ఇబ్బంది పడుతున్న ట్రంప్, పలువురితో చర్చిస్తున్న అధ్యక్షుడు
2:14 PM, 9 Nov

కోవిడ్-19 టాస్క్ ఫోర్స్‌లో కి భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తిని కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న జో బిడెన్ ఎంపిక చేసే అవకాశం ఉంది
10:05 PM, 8 Nov

ప్రపంచ దేశాల స్వేచ్ఛా స్ఫూర్తిని, భాగస్వామ్య ప్రయోజనాన్ని పునరుద్ధరించడానికి ప్రజాస్వామ్య దేశాలతో ఈ సదస్సు సాగనుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. ఇటువంటి శిఖరాగ్ర సమావేశంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.
11:51 AM, 8 Nov

అమెరికా

తాను ఈ స్థాయికి చేరుకుంటానని తన తల్లి ఏ మాత్రం ఊహించి ఉండబోదని అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ వ్యాఖ్యానించారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తల్లి తనకు ఆదర్శమని, ఆమె నుంచి తాను స్ఫూర్తిపొందాననీ చెప్పారు.
11:40 AM, 8 Nov

అమెరికా

అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ స్వగ్రామానికి పోటెత్తిన సందర్శకులు. తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలోని తులసేంద్రపురం కమలా హ్యారిస్ స్వస్థలం.
11:22 AM, 8 Nov

తమిళనాడు

అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం తమిళనాడులోని తులసేంద్రపురం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆ రాష్ట్ర మంత్రి ఆర్ కామరాజ్. కమలా హ్యారిస్ విజయం తమ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని కామెంట్స్.
9:09 AM, 8 Nov

అమెరికా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం జో బిడెన్ తొలిసారిగా ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. డెల్వర్‌లోని విల్మింగ్టన్ నుంచి కమలా హ్యారిస్‌తో కలిసి మాట్లాడారు.
10:47 PM, 7 Nov

కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న జో బిడెన్
10:46 PM, 7 Nov

అమెరికా ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా. నాకు ఓటు వేసిన వారికి ఓటు వేయని వారికి కూడా మంచి అధ్యక్షుడిగా నడుచుకుంటా. అమెరికా ముందు చాలా సవాళ్లున్నాయి: జో బిడెన్
10:45 PM, 7 Nov

అమెరికా చరిత్రలోనే కురవృద్ధ అధ్యక్షుడిగా జో బిడెన్
10:44 PM, 7 Nov

284 ఎలక్టొరాల్ ఓట్లు సాధించిన జో బిడెన్, ట్రంప్‌కు 214 ఎలక్టోరాల్ ఓట్లు
10:25 PM, 7 Nov

అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబిడెన్.. ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్
5:52 PM, 7 Nov

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.. కౌంటింగ్ జరిగే రాష్ట్రాల్లో బిడెన్ ముందంజలో ఉన్నారు
2:21 PM, 7 Nov

ఆరు ఎలక్టోరల్ ఓట్లున్న నెవెడాలో జోబిడెన్ ఆధిక్యత
2:20 PM, 7 Nov

20 ఎలక్టోరాల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో జో బిడెన్ ఆధిక్యం
2:20 PM, 7 Nov

16 ఎలక్టరోల్ ఉన్న జార్జియా రాష్ట్రంలో జో బిడెన్ ఆధిక్యం
2:19 PM, 7 Nov

బైడెన్‌కు భద్రత పెంచిన అమెరికా సీక్రెట్ సర్వీసెస్
12:21 PM, 7 Nov

ఫిలడెల్ఫియాలో పూర్తి కాని కౌంటింగ్. చీకటి పడటంతో బ్రేక్ ఇచ్చిన సిబ్బంది. దీంతో పెన్సిల్వేనియా ఫలితాలు రేపు వెలువడే అవకాశం ఉంది
12:20 PM, 7 Nov

300 ఎలక్టొరాల్ ఓట్లు సాధిస్తామన్న డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్
11:18 AM, 7 Nov

పెన్సిల్వేనియాలో ట్రంప్ పై ఆధిక్యత ప్రదర్శిస్తున్న జోబిడెన్. క్రమంగా విజయానికి చేరువవుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి
9:47 AM, 7 Nov

రాజకీయాలు దేశం మేలు కోసం చేయాలి.. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్యం గెలుస్తుంది: జో బిడెన్
9:40 AM, 7 Nov

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నాయి. అయితే తుది ఫలితం వెలువడే వరకు అంతా సంయమనంతో ఉండాలి. నేను ట్రంప్ శృతువులం కాదు, కేవలం రెండు పార్టీలకు చెందిన వాళ్లమే: జో బిడెన్
8:37 AM, 7 Nov

ఇప్పటి వరకు పెన్సిల్వేనియాలో 96శాతం ఓట్లు లెక్కించబడ్డాయి. ఆధిక్యంలో దూసుకెళుతున్న జో బిడెన్
2:30 AM, 7 Nov

జాతినుద్దేశించి బిడెన్ ప్రసంగించే అవకాశం. విజేతగా ప్రకటించిన తర్వాత స్విచ్
2:06 AM, 7 Nov

విజయానికి అడుగుదూరంలో బిడెన్
1:11 AM, 7 Nov

మరో నాలుగైదు గంటల్లో తేలనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు
1:11 AM, 7 Nov

జార్జియాలో కొనసాగుతోన్న రీ కౌంటింగ్
11:27 PM, 6 Nov

ఇంకా ఎన్నికల ఫలితాల ప్రక్రియ ముగియలేదు: ట్రంప్ అనుచరులు
10:32 PM, 6 Nov

అత్యంత కీలకమైన జార్జియా రాష్ట్రంలోనూ ప్రస్తుతం జో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ట్రంప్ ఈ రాష్ట్రంలో ఆధిక్యతను చూపగా.. తాజాగా, జో బైడెన్ ముందుకు దూసుకొచ్చారు. జార్జియాలోనూ బైడెన్ ఆధిక్యతను చూపుతుండటంతో ఇక ఆయనకు లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది.
READ MORE

English summary
November 3rd stands as a historic day in US as the country goes for polling to elect the new President. Current President and the Republican candidate Donald Trump is confident of his win over Democratic Candidate Joe Biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X