Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ 'బిగ్ బ్యూటిపుల్ బిల్' కు అమెరికా సెనెట్ ఆమోదం.. భారత్ కు భారీ నష్టం తప్పదా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్లు ఎట్టకేలకు అమెరికా సెనెట్ ఆమోదం పొందింది. ఈ బిల్లుకు సెనెట్ లో అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 50 ఓట్లు రావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన ఓటుతో ఈ బిల్లును గట్టెక్కించారు. దీంతో ట్రంప్ కలల బిల్లు చట్టరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును రిపబ్లికన్ పార్టీకి చెందిన ముగ్గురు మాత్రం వ్యతిరేకించడం గమనార్హం. నార్త్ కరోలినాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెన్స్ థోమ్ తిల్లిస్, మెయిన్ కు చెందిన సుసాన్ కొలిన్స్, కెన్ టకీ కు చెందిన సెన్ రాండ్ పాల్ లు వ్యతిరేకించారు.

అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్లు ఎట్టకేలకు అమెరికా సెనెట్ లో ఆమోదం పొందింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓటుతో బిల్లు చట్టసభలో గట్టెక్కింది. అయితే ఈ బిల్లును అధికార రిపబ్లిక్ పార్టీకి చెందిన ముగ్గురు ప్రతినిధులు వ్యతిరేకించడం గమనార్హం. మరోవైపు ఈ బిల్లుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ బిల్లులో ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ పై ఆందోళన నెలకొంది. బిగ్ బ్యూటిపుల్ బిల్లు అమల్లోకి వస్తే భారత్ తో పాటు అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

US Senate Passes Trump s Big Beautiful Bill Experts Warn of Major Economic Loss for India

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్లు ఆమోదం పొందితే ట్యాక్స్ పేయర్లపై భారీగా భారం పడుతుందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. బిల్లు సెనెట్ లో ఆమోదం పొందితే ఆ తర్వాతి రోజే కొత్త అమెరికా పార్టీ పెడతానని తేల్చి చెప్పారు. డెమొక్రాట్స్, రిపబ్లికన్స్ కు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ అవసరం అని మస్క్ అభిప్రాయపడ్డారు.

అంతేకాక ఈ బిల్లు అమెరికాలోని లక్షల మంది ఉద్యోగాలను హరించేస్తుందని మస్క్ ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు. అనేక దేశాలకు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు. అంతేకాక ఈ బిల్లు రిపబ్లికన్ పార్టీ నేతల రాజకీయ ఆత్మహత్యగా ఎలాన్ మస్క్ అభివర్ణించారు. ఈ బిల్లు దేశానికి పెను హాని తలపెట్టనుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+