వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రీమర్లకు షాక్! కీలక బిల్లులు తిరస్కరించిన సెనేట్, హెచ్‌1బీ ఆశావహులకు నిరాశే..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కు అమెరికా ఎగువసభ సెనేట్ షాకిచ్చింది. వారికి పౌరసత్వం కల్పించేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును శుక్రవారం 60-39 ఓట్ల తేడాతో తిరస్కరించింది.

ట్రంప్‌తో.. బిల్‌ గేట్స్ ఢీ! 'అమెరికా ఫస్ట్' భావనే తప్పు, అలాంటివి మానుకోండి, మెలిండా హితవు!ట్రంప్‌తో.. బిల్‌ గేట్స్ ఢీ! 'అమెరికా ఫస్ట్' భావనే తప్పు, అలాంటివి మానుకోండి, మెలిండా హితవు!

ఈ నేపథ్యంలో డ్రీమర్ల భవితవ్యంపై అమెరికాలో మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. నిజానికి ఈ బిల్లు గనుక ఆమోదం పొందినట్లయితే అటు డ్రీమర్లకు మేలు జరగడంతోపాటు ఇటు హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తోన్న ఎంతోమంది భారతీయులకూ లబ్ధి కలిగి ఉండేది.

 గందరగోళంలో డ్రీమర్ల భవిష్యత్తు...

గందరగోళంలో డ్రీమర్ల భవిష్యత్తు...

మళ్లీ అమెరికాలోని డ్రీమర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. వారికి పౌరసత్వం కల్పించే బిల్లు సెనేట్‌లో ఓడిపోయిన నేపథ్యంలో దాదాపు 18 లక్షల మంది స్వాప్నికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరికి దశలవారీగా అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు గతంలో బరాక్ ఒబామా ప్రభుత్వం డెఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డాకా) పథకాన్ని తెచ్చింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని ఎత్తివేశారు. దీంతో ఆరు నెలల్లోగా వారి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ సూచించింది. లేకుంటే మార్చి 5వ తేదీ నుంచి డ్రీమర్స్ అందరూ దేశబహిష్కరణకు గురవుతారు.

60-39 ఓట్ల తేడాతో తిరస్కరణ...

60-39 ఓట్ల తేడాతో తిరస్కరణ...

డ్రీమర్లకు పౌరసత్వం కల్పించే అంశంపై ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అటు డెమెక్రాట్లు పలు దఫాలు చర్చలు జరిపారు. చివరికి అమెరికాలోని 18 లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం ఇచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇందుకు ప్రతిగా 2.5 వేల కోట్ల డాలర్ల ఖర్చుతో అమెరికా, మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి ప్రతిపక్షం కూడా ఒప్పుకుంది. ఇలా పరస్పర ఒప్పందంతో బిల్లును రూపొందించి ఎగువ సభ సెనేట్‌లో ప్రవేశపెట్టినా చివరికి ఈ బిల్లు 60-39 ఓట్ల తేడాతో తిరస్కరణకు గురైంది.

 నిరాశలో ప్రవాస భారతీయులు....

నిరాశలో ప్రవాస భారతీయులు....

డ్రీమర్ల సంక్షేమం కోసం ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు గనుక ఆమోదం పొందినట్లయితే అమెరికాలోకి కుటుంబ ఆధారిత వలసలతోపాటు దేశాల వారీగా చేపట్టే లాటరీ వీసా పద్ధతి కూడా రద్దయ్యేది. ఫలితంగా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయులకు లబ్ధి చేకూరి ఉండేది. కానీ ఇప్పుడీ బిల్లు వీగిపోవడం.. అందరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

మార్చి 5 తరువాత ఏం జరుగుతుంది?

మార్చి 5 తరువాత ఏం జరుగుతుంది?

అమెరికాలో వలసలపై సెనెటర్లు షుమర్‌-రౌండ్స్‌-కొలిన్స్‌ ప్రతిపాదించిన మరో బిల్లును సైతం ఎగువ సభ 54-45 ఓట్ల తేడాతో తిరస్కరించింది. నిజానికి అమెరికా సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావడం తప్పనిసరి. వీసా జారీలో లాటరీ విధానం రద్దు సహా దేశాల వారీగా గ్రీన్‌కార్డుల సంఖ్య పరిధి ఎత్తివేతకు సంబంధించిన బిల్లులను ఇప్పుడు అమెరికా ఎగువసభ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో త్వరలో మరో ఒప్పందం కుదరకుంటే మార్చి 5 తర్వాత 18 లక్షల మంది డ్రీమర్లను బలవంతంగా విదేశాలకు పంపిస్తారేమోనన్న భయాలు నెలకొన్నాయి.

English summary
The US Senate on Thursday rejected a slew of immigration reform proposals, including one backed by President Donald Trump, leaving hundreds of thousands of young migrants who were brought to the country illegally as children in limbo.The Senate also shot down a bipartisan deal on immigration offered by the Trump administration which had offered to provide citizeship to some 1.8 million American's so-called "Dreamers" in exchange of USD 25 billion for construction of a wall along the Mexican border and other security measures. Senators, in a series of votes, failed to muster enough votes for either of the immigration plan to move ahead. In fact, the bill backed by Trump lost 39-60 votes. If passed, the bill would have paved the way for permanent legal status to 1.8 million young legal immigrants and provided USD 25 billion towards building a wall along the Mexico border. The White House supported bill would have also curbed family-based immigration and ended diversity lottery visa. But the bill fell far short of 60 votes mark required to clear a filibuster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X