'భారత్ అంతు చూస్తాం.. ఆర్థికంగా దెబ్బ కొడతాం'.. అమెరికా సంచలన వార్నింగ్
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధం రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతోంది. వందలకొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ అట్టుడికి పోతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తామని బాంబ్ పేల్చారు. రష్యా శాంతి చర్చలకు ఏ మాత్రం సహకరించకపోగా దాడులు కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఉక్రెయిన్ కు తమ దేశ పౌరులను రక్షించుకునే హక్కు ఉందని.. అందువల్ల ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అయితే ట్రంప్ ఈ విషయం వెల్లడించాక ఉక్రెయిన్ పై దాడులను మరింత పెంచింది రష్యా. వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ ను ధ్వంసం చేస్తోంది. ఈ క్రమంలో రష్యా ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని అమెరికా ప్రణాళికలు వేస్తోంది.
ఉక్రెయిన్ పై మూడేళ్లుగా విరుచుకుపడుతున్న రష్యాను ఎలాగైనా లొంగదీసుకోవాలని అమెరికా ప్లాన్ వేస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తే పుతిన్ దారికి వస్తారని భావిస్తోంది. ఈక్రమంలో రష్యా నుంచి డిస్కౌంట్ లో ముడి చమురు, గ్యాస్ ను కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను టార్గెట్ చేసింది అమెరికా. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే టారిఫ్ లు విధిస్తామని హెచ్చరిస్తుంది అగ్రరాజ్యం. ఈ మేరకు అమెరికా సెనెటర్లు గ్రెహమ్, బ్లూ మెంతల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు 500 శాతం టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు.
🇺🇸US Senator Lindsey Graham's threat —
— Krishna.. (@Krishnacyber999) July 22, 2025
"I'm telling China 🇨🇳, India 🇮🇳 and Brazil 🇧🇷 that if you continue to buy cheap Russian oil and help fund this war, we will impose massive tariffs 🇺🇸 and destroy your economies. This is blood-earned money."#LindseyGraham #RussiaUkraineWa pic.twitter.com/0cT5KxS8lO
రష్యా నుంచి చీప్ కా చమురు, గ్యాస్ ను కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆర్థికంగా కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా సెనెటర్లు గ్రెహమ్, బ్లూ మెంతల్ పేర్కొన్నారు. భారత్, చైనా, బ్రెజిల్ తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. మీరంతా ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను నిలువరించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయా దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను నిలిపివేయాలని అమెరికాకు సహకరించాలని డిమాండ్ చేశారు. లేదంటే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్ మూడు దేశాలు కలిపి 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని అమెరికా తెలిపింది. భారత్, చైనా, బ్రెజిల్ చేస్తున్నది రక్తపాతం అని.. ఎవరైనా అతడిని ఆపేలా చేసే వరకు పుతిన్ ఆగడని అమెరికా పేర్కొంది. అంతకుముందు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే సైతం వార్నింగ్ ఇచ్చారు. బ్రిజిల్, చైనా, భారత్ దేశాలు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. అయితే ఈ విషయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం మా బాధ్యత అని భారత్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications