ఆప్ఘన్ లో అమెరికా జిత్తులు-తాలిబన్లతో డీల్-బంపర్ ఆఫర్లు-ఆంక్షల సడలింపు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి ఆ దేశాన్ని ఆక్రమించిన తాలిబన్లు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఓవైపు ఆర్ధిక సంక్షోభం, మరోవైపు ప్రజల నుంచి ఎప్పుడే రూపంలో వస్తుందో తెలియని తిరుగుబాటు, ఇంకోవైపు ప్రపంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి. ఇలా ఎటు చూసినా సమస్యల వలయంలో చిక్కుకున్న తాలిబన్లను ఆదుకునేందుకు మళ్లీ ప్రపంచ పెద్దన్న అమెరికానే ముందుకొచ్చింది. ప్రస్తుతం తాలిబన్లు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి వారిని బయటపడేసేందుకు వారితో ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Recommended Video

ఆప్ఘన్ సంక్షోభంలో తాలిబన్ల విలవిల
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని ఆక్రమించిన తాలిబన్లకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దేశ రాజధాని అయిన కాబూల్ లో కీలక విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా సేనలు... ఇప్పుడు తాము చెప్పినట్లు వినకపోతే మరోసారి తాలిబన్లపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరికలు చేస్తున్నాయి.
దీంతో మరో యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని తాలిబన్లు ఇప్పుడు అమెరికాతో సయోధ్యకు సిద్ధమవుతున్నారు. తీవ్రవాద గ్రూపు స్ధాయి నుంచి దేశాన్ని పాలించే వరకూ వెళ్లాలంటే అంతర్జాతీయంగా మద్దతు అవసరం కావడంతో ఇప్పుడు అమెరికా చెప్పినట్లు ఆడేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. ఇందుకు బదులుగా అమెరికా కూడా ఆఫర్లు ఇస్తోంది.

తాలిబన్లతో అమెరికా డీల్
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోయి వారం రోజులు కావస్తున్నా ఇంకా కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు అడుగులు వేయలేకపోతున్నారు. ఇప్పటికే ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆర్ధిక వ్యవస్ధ కూడా పతనం దిశగానే సాగుతోంది. ఆప్ఘన్ కరెన్సీ విలువ అమాంతం పడిపోయింది.
దీంతో దేశంలో త్వరలో ఆకలి కేకలు వినిపించే ప్రమాదం ముంచుకొస్తోంది. మరోవైపు సాధ్యమైనంత త్వరగా ప్రభుత్న ఏర్పాటు జరగకపోతే దేశంలో శాంతిభద్రతలు లోపించడంతో పాటు అన్ని వ్యవస్ధలూ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఒకప్పుడు దేశానికి కాపలా కాసి ఇప్పుడు కాబూల్ ఎయిర్ పోర్టుకు పరిమితమైన అమెరికాతో తాలిబన్లు కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా చెప్పినట్లు వింటే తాలిబన్ కీలక నేతలపై ఉన్న ఆంక్షల్ని ఎత్తేసేందుకు అగ్రరాజ్యం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా ఊసరవెల్లి చేష్టలు
ఆప్ఘనిస్తాన్ లో నిన్న మొన్నటి వరకూ పాలన సాగించిన ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచిన అమెరికా ఇప్పుడు అది కాస్తా కూలిపోవడంతో ఇరుకునపడింది. అలాగని ఆప్ఘనిస్తాన్ లో సహజ వనరుల దోపిడీకి గల అవకాశాలతో, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రాంతమైన ఆ దేశంపై పట్టు వేగంగా కోల్పోతోంది. దీంతో ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో ఏర్పడబోతున్న తాలిబన్ల సర్కార్ ను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతోంది.
ఇందుకోసం వారితో నిరంతరం టచ్ లో ఉంటూ సంప్రదింపులు జరుపుతోంది. దీంతో ఇప్పుడు ఆప్ఘన్ నుంచి పారిపోవాలనుకునే వారు కూడా అమెరికా, తాలిబన్ ఇద్దరి అనుమతి తీసుకోవాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి.

తాలిబన్లకు అమెరికా బంపర్ ఆఫర్
ఇంతకాలం తాలిబన్లను తమ శత్రులువుగా పరిగణిస్తూ వారిపై పలు మార్గాల్లో దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో వారికి బంపర్ ఆఫర్లు ఇస్తోంది. ఇప్పటివరకూ పలువురు తాలిబన్ కీలక నేతలపై ఆంక్షలు విధించిన అమెరికా.. ఇప్పుడు వాటిని ఎత్తేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తాలిబన్ కీలక నేతలు అబ్దుల్ ఘనీ బరాదర్, హక్కానీ నెట్ వర్క్ నేత సిరాజుద్దీన్ హక్కానీ వంటి వారు ఉన్నారు.
వీరిపై గతంలో విధించిన ఆంక్షల్ని సడలించడం ద్వారా వీరు స్వేచ్ఛగా విదేశాల్లో తిరిగేందుకు అనుమతించబోతోంది. దీనికి బదులుగా ఆప్ఘనిస్తాన్ లో తాము చెప్పినట్లు నడుచుకోవాలని అగ్రరాజ్యం ప్రతిపాదిస్తోంది. దీంతో తాలిబన్లు కూడా ఈ ఆఫర్ కు ఓకే చెప్పే అవకాశముంది.

135 మంది తాలిబన్ నేతలకు ఊరట
అమెరికాతో తాలిబన్లు కుదుర్చుకున్న డీల్ ప్రకారం అగ్రరాజ్యం గతంలో 1988 ఆంక్షల కమిటీ (తాలిబన్లపై ఆంక్షల కమిటీ ) విధించిన ఆంక్షల నుంచి తాలిబన్లతో పాటు హక్కానీ నెట్ వర్క్ కు చెందిన 135 మంది నేతలకు మినహాయింపులు ఇచ్చే అవకాశముంది. ఇందులో కీలక నేతలైన అబ్దుల్ ఘనీ బరాదర్, సిరాజుద్దీన్ హక్కానీతో పాటు ఆప్ఘన్ తదుపరి అధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్న హైబతుల్లా అఖుంద్ జాదా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై ఇన్నాళ్లూ విదేశాల్లో స్వేచ్ఛగా విహరించకుండా అమెరికా ఆంక్షలు విధించింది.
ఐక్యరాజ్యసమితి ద్వారా కొన్ని ఆంక్షలు, నేరుగా తానే మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇప్పుడు తాలిబన్లతో కుదుర్చుకున్న డీల్ తో వీరందరికీ ఊరట లభించే అవకాశముంది. ఇప్పటికే తాలిబన్ కీలక నేతల పర్యటనలపై ఉన్న నిషేధంపై మినహాయింపు సెప్టెంబర్ 21 వరకూ అమల్లో ఉంది. ఆ తర్వాత కూడా దీన్ని పొడిగించబోతోంది. ఈ మేరకు వారికి అగ్రరాజ్యం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోసారి అమెరికా చేతుల్లోకి ఆప్ఘన్ ?
తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న తాజా డీల్ తో సంక్షోభిత ఆప్ఘనిస్తాన్ మరోసారి అమెరికా చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పైకి పాశ్చాత్య విధానాల్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటున్న తాలిబన్లు.. తాజా పరిస్దితుల్లో తమ అస్ధిత్వాన్ని కాపాడుకునేందుకు అమెరికాకు తలొగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాతో కుదుర్చుకున్న డీల్ తో తమ కీలక నేతలకు ఆంక్షల నుంచి ఊరట లభించడంతో పాటు ఆప్ఘన్ ఆర్ధిక వ్యవస్ధను గాడినపెట్టొచ్చని వారు భావిస్తున్నారు.
ప్రస్తుత మిత్రదేశం పాకిస్తాన్ కంటే అమెరికాతో మితృత్వమే తమకు మంచిదని తాలిబన్ కీలక నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి పరిస్ధితుల్ని సొమ్ము చేసుకుంటూ ఆప్ఘనిస్తాన్ ను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications