తల్లిదండ్రులు, సోదరితోపాటు నలుగురిని కాల్చి చంపేసిన యువకుడు
వాషింగ్టన్: తల్లిదండ్రులు, సోదరితోపాటు మరో నలుగురి ప్రాణాలు తీసిన ఓ 16ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం న్యూజెర్సీలో చోటు చేసుకుంది.

న్యూజెర్సీలోని తన ఇంట్లో నిందిత యువకుడు తుపాకీతో కాల్పులకు తెగబడి వీరి ప్రాణాలు తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో నిందితుడి తండ్రి స్టీవెన్ కోలోగి(44), తల్లి లిండా కొలోగి(42), సోదరి బ్రిట్టనీ కొలగి(18), మరొకరు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మేరీ షుల్ట్జ్(70) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతున్న వేళ(ఆదివారం అర్ధరాత్రి) ఈ దారుణం జరగడం గమనార్హం. నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వారిని ఎందుకు కాల్చి చంపాడో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications