వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా దిద్దుబాటు: ఆ వ్యాఖ్యలపై: అత్యవసర భాగస్వామి: పరిస్థితి అర్థం చేసుకోగలం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై సాగిస్తోన్న యుద్ధాన్ని రోజురోజుకూ ఉధృతం చేస్తోన్న వేళ.. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరింత ముమ్మరం చేశారు. రష్యాను వ్యతిరేకిస్తోన్న దేశాలతో కలిసి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నారు. రష్యాను ఒంటరి చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారు. తటస్థ దేశాలను కూడా తన వైపు తిప్పుకొంటోన్నారు. ఇందులో భాగంగా- ఆయన భారత్‌ను కూడా ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.

 క్వాడ్‌లో భారత్ మినహా..

క్వాడ్‌లో భారత్ మినహా..

భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. క్వాడ్‌లో సభ్యత్వం గల దేశాలు. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన రెండూ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి. జపాన్, ఆస్ట్రేలియా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. ఈ యుద్ధంలో రష్యా వైఖరిని తప్పు పట్టాయి. ఇక మిగిలింది- భారత్. రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగివున్న భారత్.. రష్యాతో వైరం ఏ మాత్రం కోరుకోవట్లేదు. అలాగనీ- యుద్ధాన్ని గానీ, ఈ విషయంలో రష్యాను గానీ సమర్థించట్లేదు. తటస్థంగా ఉంటోంది.

భారత్‌పై విమర్శలు..

భారత్‌పై విమర్శలు..


రష్యాకు వ్యతిరేక కూటమి దేశాల్లో భారత్ చేరకపోవడాన్ని జో బైడెన్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని, వణికిపోతోందంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని చెప్పారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు.

క్వాడ్‌లో కంటిన్యూ..

క్వాడ్‌లో కంటిన్యూ..

ఆ మరుసటి రోజే అమెరికా దిద్దుబాటు చర్యల్లో పడినట్టు కనిపిస్తోంది. క్వాడ్‌లో భారత్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. క్వాడ్‌లో భారత్ తమకు అత్యవసర భాగస్వామిగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అభివర్ణించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తోన్నప్పటికీ- ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో భారత్ తమ అత్యవసర భాగస్వామి అని పేర్కొన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించుకోగల నమ్మకమైన భాగస్వామి అని చెప్పారు.

 భారత్ పరిస్థితిని అర్థం చేసుకోగలం..

భారత్ పరిస్థితిని అర్థం చేసుకోగలం..

అంతకుముందే- ఆస్ట్రేలియా సైతం భారత్ పట్ల కొంత సానుకూల వైఖరిని కనపరిచింది. క్వాడ్‌లో సభ్యత్వం ఉన్న దేశం.. ఆస్ట్రేలియా. భారత్ మినహా ఇందులో సభ్యత్వం ఉన్న ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా.. ఈ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన విషయం తెలిసిందే. తమతో భారత్ కలిసి రాకపోవడం పట్ల ఆస్ట్రేలియా స్పందించింది. భారత్ పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని ఆ దేశ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు. ఆ తరువాతే- నెడ్ ప్రైస్ కూడా అమెరికా వైఖరి ఏమిటో తేల్చి చెప్పారు.

English summary
The US termed India as an essential partner for its shared vision of a free and open Indo-Pacific and highlighted that regardless of India-Russia historical ties, the US is a partner of choice for India now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X