గుడ్‌న్యూస్: ఇండియన్ టెక్కీలకు మరో ఛాన్స్, హెచ్1బీ వీసా సెకండ్ రౌండ్
యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ గుడ్ న్యూస్ తెలియజేసింది. భారత టెక్కీలకు ఊరటనిచ్చే అంశం తెలియజేసింది. రెండో రౌండ్ లాటరీ పద్దతిలో హెచ్ 1బీ వీసాలు జారీ చేస్తామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. మొదటి రౌండ్ లాటరీ విధానంలో అనుకున్న స్ధాయిలో ఎంపికలు జరగకపోవటంతో రెండో రౌండ్ లాటరీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

విపరీతంగా డిమాండ్
హెచ్ 1బీ వీసాలకు ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉంది. ప్రతిఏటా అమెరికా 85 వేల కొత్త హెచ్ 1 వీసాలను జారీచేస్తుంది. వృత్తి నైపుణ్య నిపుణులు వీటిని సద్వినియోగం చేసుకుంటారు. వీరిలో అధిక సంఖ్యలో చైనా, భారత్ వంటి దేశాలకు చెందిన ఐటీ సంస్ధలకు చెందిన నిపుణులు ఉంటున్నారు. వీసాల జారీ విషయంలో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించటంతో మొదటి రౌండ్ లాటరీ విధాన్ని పూర్తిచేశారు.

ఆగస్ట్ 2 నుంచి
ఆగస్టు 2 నుండి ప్రారంభం కానున్న పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30 వరకు హెచ్ 1బీ వీసాలకు దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరిని హెచ్ 1బీ వీసాలకు మొదటి లాటరీలో ఎంపిక చేసింది. ప్రస్తుతం రెండో రౌండ్ లాటరీ ద్వారా హెచ్ 1బీ వీసాలు జారీ చేస్తామనే ప్రకటనతో స్టెమ్, ఒపీటీ విద్యార్ధులకు ఊరట లభించింది.

హెచ్1బీ వీసా అంటే..?
అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అమెరికాలో 90లలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆ దేశ ఆర్థికవ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉంది. నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో హెచ్-1బీ వీసాలను ప్రారంభించారు. జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ యాక్ట్-1990 అమల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications