వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగ్భ్రాంతికరం: పెద్ద గాలిపటంతోపాటు ఆకాశంలోకి ఎగిరిపోయిన చిన్నారి(వీడియో)

|
Google Oneindia TeluguNews

తైపీ: తైవాన్‌లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న కైట్ ఫెస్టివల్‌లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అంతా తమ గాలి పటాలను ఎగురవేసుకుంటూ ఎంతో సందడిగా ఉన్నారు. ఒక్కసారిగా ఓ పెద్ద గాలి పటానికి వేలాడుతూ ఓ మూడేళ్ల చిన్నారి ఆకాశంలో కనిపించింది. దీంతో అక్కడి వాతావరణమంతా ఉత్కంఠగా మారింది.

సుమారు 100 ఫీట్ల ఎత్తులో గాలి పటంతోపాటు ఆ చిన్నారి కూడా గాలిలో వేలాడుతూ కనిపించింది. భయంతో కేకలు వేసింది. అక్కడున్నవారంతా ఆ చిన్నారిని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించారు. వెంటనే ఆ గాలిపటానికి సంబంధించిన ధారాన్ని కిందికి లాగారు.

Video: Girl, 3, Survives Wild Skyride Caught In Tail Of Giant Kite

గాలి పటంతోపాటు ఆ చిన్నారి కూడా కిందికి వచ్చింది. అక్కడున్నవారంతా ఆమెను కిందపడకుండా పట్టుకున్నారు. కాగా, ఆ చిన్నారిని 'లిన్‌'గా గుర్తించారు. ఈ ఘటనలో ఆమెకు చిన్న చిన్నగాయాలయ్యాయి. తైవాన్ ఈశాన్యంలోని హ్సిన్చు నగరంలో జరిగిన గాలి పటాల ఫెస్టివల్‌లో చోటు చేసుకుంది.

బలంగా వీచిన గాలులే ఈ ఘటనకు కారణమయ్యాయని నగర ప్రభుత్వ అధికారులు తెలిపారు. గాలులు బలంగా వీయడంతో ఆ గాలిపటం ధారం తగిలి ఆ చిన్నారి దాంతోపాటు గాలిలోకి ఎగిరిపోయిందని చెప్పారు. అయితే, పెను ప్రమాదం తప్పినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లక్షల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. వీడియో చూసినవారంతా పెద్ద ప్రమాదం తప్పిందని అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

English summary
A three-year-old girl entangled in the tail of a giant kite survived a terrifying ride after being swept more than 100 feet (30 metres) into the air during a kite festival in Taiwan, video footage posted on social media on Sunday showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X