వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: అతిపెద్ద ఉక్రెయిన్ విమానం శకలాలివే: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో అనుబంధం: నేలకూల్చిన రష్యా

|
Google Oneindia TeluguNews

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధం.. తొమ్మిదో రోజు మరింత ఉధృతమైంది. రష్యన్ సైనిక బలగాలు తమ దాడులు ముమ్మరం చేశాయి. దాదాపు అన్ని నగరాలపైనా విరుచుకుని పడుతున్నాయి. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో పురోగతిని ప్రదర్శిస్తోన్నాయి. కీవ్‌కు మరింత చేరువ అయ్యాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోన్నప్పటకీ- రష్యా వెనుకంజ వేయట్లేదు.

ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలోని పలు నగరాలపై రష్యన్ ఆర్మీ దాడులు దూకుడును కొనసాగిస్తోంది. యుద్ధం ఆరంభమైన తొలి రోజు నుంచే రష్య తన దాడులను తీవ్రతరం చేస్తూ వచ్చింది. ఏ ఒక్క లక్ష్యాన్నీ వదల్లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్ ఆంటొనొవ్ ఏఎన్-225నూ ధ్వంసం చేసింది. రష్యా సైనిక బలగాలు సంధించిన రాకెట్ల దాడికి ముక్కలైందీ ఫ్లైట్. ఈ విమానాన్ని రష్యా సైనికులు ధ్వంసం చేశారనే విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా ధృవీకరించారు.

Russian State TV released a footage of Remains of the AN-225 from Gostomel Airport, Kyiv.

తమ దేశానికి అత్యంత గర్వకారణంగా నిలిచిన ఫ్లైట్‌ను రష్యా పేల్చి వేసిందని చెప్పారు. దీనికి రష్యా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని, ప్రతీకారాన్ని తీర్చుకుంటామని ఆయన అప్పట్లో హెచ్చరించారు. ఈ విమానం పేరు మృియా. మిృయా అంటే ఉక్రెయిన్ భాషలో కల అని అర్థం. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని తయారు చేయాలనే కలను సాకారం చేసుకున్నందుకు- ఆ దేశ ప్రభుత్వం దీనికి ఆ పేరు పెట్టింది.

Russian State TV released a footage of Remains of the AN-225 from Gostomel Airport, Kyiv.

ఆంటొనొవ్ సంస్థ- దీన్ని తయారు చేసింది. 640 టన్నుల బరువును మోయగల సామర్థ్యం దీని సొంతం. ఉక్రెయిన్ రూపొందించిన ఈ విమానానికి హైదరాబాద్‌ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుబంధం ఉంది అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇదివరకు ఈ మిృయా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. 84 మీటర్ల పొడవు ఉండే రెక్కలు గల ఈ విమానం 2016 మేలో ఇక్కడ దిగింది. భారత గగనతలం మీదుగా ప్రయాణిస్తోన్న సమయంలో ఇంధనాన్ని నింపుకోవడానికి శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది.

తాజాగా- ఈ విమానానికి సంబంధించిన శకలాలను రష్యన్ స్టేట్ మీడియా విడుదల చేసింది. కీవ్‌లోని గొస్టొమెల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమాన శకలాలు ఉన్నాయి. ఆ మీడియా హౌస్‌కు చెందిన ప్రతినిధురాలు గొస్టొమెల్ ఎయిర్‌పోర్ట్ నుంచి రిపోర్టింగ్ చేశారు. విమాన, విమాన శకలాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 58 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రెక్కలు తెగిన గండభేరుండ పక్షిలా కనిపించింది- మ్రియా.

English summary
Russian State TV released a footage of Remains of the AN-225 from Gostomel Airport, Kyiv.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X