viral video: అమెరికాలో అలాంటి పనులు చేస్తూ దొరికిపోయిన భారత్ అమ్మాయిలు
అమెరికా వెళ్లడం ఓ డ్రీమ్ గా పెట్టుకుంటారు భారత్ విద్యార్థులు. విద్య, ఉపాధి అవకాశాలు అమెరికాలో అధికంగా ఉన్న నేపథ్యంలో అనేకమంది యువత అమెరికా, కెనడా దేశాలకు వెళ్లాలను కలలు కంటూ ఉంటారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం మారుతూ వస్తోంది. 2023-24లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3.31 లక్షలకు చేరింది. 2023లో గ్రీన్ కార్డ్ పొందిన వారిలో భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే H-1B వీసాలలో 80 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.

అయితే విద్య, ఉపాధి అంటూ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడ రకరకాల కారణాలతో జీవనం సాగించడం కష్టంగా మారినట్లు స్పష్టం అవుతోంది. తాజాగా కెనడాలోని ఓ రైల్వే స్టేషన్ లో భారత్ కు చెందిన ఓ యువతి ప్లాట్ ఫామ్ పై కూర్చుని భిక్షాటన చేస్తూ ఉంది.
Indian lady spotted begging at a Canadian station.
— 🐯Sherovic (@Sherovicisfire) September 7, 2025
At home, they depend on alimony and abroad the freebie mindset shows up as begging! pic.twitter.com/fYluAdL2Iq
వచ్చిపోయేవారిని డబ్బులు ఇవ్వాలని వేడుకుంటుంది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించారు. తనను వీడియో తీస్తున్నారని తెలుసుకున్న ఆ యువతి ముఖం కప్పేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక మరో వీడియోలో ఓ యువతి అమెరికాలోని కొన్ని షాపింగ్ మాల్స్ లో చోరీలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆమె తనను విడిచిపెట్టాలని పోలీసులను వేడుకుంటున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తాను గుజరాత్ నుంచి వచ్చినట్లు యువతి తెలిపింది. పోలీసుల దర్యాప్తుకు భయపడిన ఆ యువతి తీవ్రంగా ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజెన్లు మిక్స్ డ్ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications