ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ? మోడీ ప్రతిపాదనకు పుతిన్ అంగీకారం- వాట్ నెక్స్ట్ ?

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరునెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఓ కీలక అడుగు పడింది. ఉక్రెయిన్ పై యుద్ధంతో ప్రపంచ దేశాలకు కంటగింపుగా మారిన రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ జరిపిన చర్చలు ఫలించాయి. ఈ మేరకు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని త్వరలో ముగించేందుకు పుతిన్ అంగీకరించారు. అయితే యుద్ధం ఎందుకు చేస్తున్నారో కూడా పుతిన్ వెల్లడించారు.

రష్యా-ఉక్రెయిన్ పోరు

రష్యా-ఉక్రెయిన్ పోరు

అంతర్గత భద్రతా కారణాలు చూపుతూ ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన దండయాత్ర పలు విపరిణామాలకు దారి తీసింది. ఆరునెలలుగా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం ఎలా ముగించాలో తెలియక రష్యా తలపట్టుకుంటోంది. అదే సమయంలో ఈ యుద్ధానికి ప్రతిఫలంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై సాగిస్తున్న పోరు మరింత తీవ్రమవుతోంది.

ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలతో రష్యా కుదేలవుతోంది. తన దగ్గర ఉన్న చమురు కూడా ఎలా అమ్ముకోవాలో తెలియక ఆర్ధిక వ్యవస్ధను కాపాడుకునేందుకు భారత్ వంటి సుదూర దేశాల్ని బతిమాలుకోవాల్సిన పరిస్ధితి పుతిన్ కు తలెత్తింది. దీంతో యుద్ధం ముగించేందుకు పుతిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 పుతిన్ కు మోడీ ప్రతిపాదన

పుతిన్ కు మోడీ ప్రతిపాదన

ఈ తరుణంలో ఉజ్బెకిస్తాన్ లో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య సదస్సులో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ కీలక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భారత ప్రధాని మోడీ ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేయాలని పుతిన్ కు సూచించారు. ఎస్.సి.ఓ సదస్సులో ఉక్రెయిన్ పై తాను యుద్ధం ఎందుకు చేస్తున్నదీ పుతిన్ వివరించారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఉక్రెయిన్ నిరాకరించడం వల్లే యుద్దం చేయాల్సి వస్తోందని పుతిన్ తెలిపారు. దీంతో పుతిన్ ను యుద్ధం ఆపేయాలని ప్రధాని మోడీ కోరారు.

ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలన్న మోడీ

ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలన్న మోడీ

ఉక్రెయిన్ లో రష్యా సాగిస్తున్న యుద్ధంపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ప్రధాని మోడీ.. ఎస్.సి.ఓ సదస్సులో భాగంగా పుతిన్ లో ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆహార భద్రత, ఇంధన సంక్షోభం, ఎరువుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని పుతిన్ ను మోడీ కోరారు. ఇది యుద్ధాల యుగం కాదని, ప్రజాస్వామ్యం, దౌత్యనీతి ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని కూడా సూచించారు. భారత్-రష్యా బంధాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని యుద్ధానికి ముగింపు పలకాలన్నారు.

 ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తానన్న పుతిన్

ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తానన్న పుతిన్

దీంతో పుతిన్ కూడా ప్రధాని మోడీ ప్రతిపాదనకు అంగీకరించారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మీ ఆందోళన తనకు తెలుసన్నారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన ప్రయత్నాలు అన్నీ చేస్తామన్నారు. ఉక్రెయిన్ చర్చలకు అంగీకరించకపోవడం వల్లే యుద్ధం చేయాల్సి వస్తోందని, అక్కడ ఏం జరుగుతుందో భారత్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తానని పుతిన్ తెలిపారు. అనంతరం పుతిన్ తో భేటీపై మోడీ ట్విట్టర్ లోనూ స్పందించారు. పుతిన్ తో చర్చలు సఫలమయ్యాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+