వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక యుద్ధ నేరాలపై నేడు ఐరాసలో ఓటింగ్‌-తమిళ ఎన్నికల వేళ భారత్‌ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో సింహళీయులకూ, తమిళులకూ మధ్య దశాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధంలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మెజారిటీగా ఉన్న సింహళీయులు మైనార్టీలపై సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి తమిళ టైగర్స్‌ ఈలం ఆవిర్భావం నుంచి దాన్ని తుడిచిపెట్టే వరకూ సింహళీయుల ఆధిపత్యం అడుగడుగునా కనిపిస్తుంది. టైగర్స్‌ను అయితే తుడిచిపెట్టగలిగిన శ్రీలంక ప్రభుత్వం ఈ క్రమంలో చేసిన మానవ హక్కుల ఉల్లంఘనపై మాత్రం ఐక్యరాజ్యసమితిలో దోషిగా నిలబడింది.

శ్రీలంక అంతర్యుద్ధ నేరాలపై ఐరాసలో ఓటింగ్‌

శ్రీలంక అంతర్యుద్ధ నేరాలపై ఐరాసలో ఓటింగ్‌


శ్రీలంకలో అంత్యరుద్ధం సందర్భంగా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి మానన హక్కుల సంఘం ప్రవేశపెట్టిన తీర్మానంపై ఇవాళ ఓటింగ్‌ జరగబోతోంది. గతంలో తమిళులను అణగదొక్కేందుకు శ్రీలంకలోని సింహళీయుల మెజారిటీ ప్రభుత్వం చేసిన అకృత్యాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. శ్రీలంక తీరుపై ఆగ్రహంగా ఉన్న ఐరాస సభ్య దేశాలు మానవ హక్కుల సంఘంలో ఓ తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఇవాళ ఓటింగ్‌ జరగబోతోంది. శ్రీలంకలో సయోధ్యతో కూడిన జవాబుదారీతనం మరియ మానవ హక్కులు అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు గోటబాయ రాజపక్స సోదరుడు మహీంద రాజపక్స అధికారంలో ఉండగా ఐరాసలో ప్రవేశపెట్టిన మూడు తీర్మానాల్లోనూ శ్రీలంక ఓడిపోయింది. ఇప్పుడు ఈ తీర్మానంలోనూ లంకకు మద్దతు లభించకపోతే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. శ్రీలంక మాత్రం ఈ తీర్మానం వెనుక బ్రిటన్‌ రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తోంది. మానవహక్కుల పరిరక్షణతో పాటు దేశ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది.

శ్రీలంకకు మద్దతిచ్చేదెవరు ?

శ్రీలంకకు మద్దతిచ్చేదెవరు ?

ఇవాళ తమ దేశంపై ఐరాస మానవహక్కుల సంఘంలో ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్‌లో శ్రీలంక విఫలమైతే కఠిన ఆంక్షలు విధించేందుకు ఐరాస సిద్ధమవుతోంది. దీంతో ఈ ఓటింగ్‌లో మద్దతు కోసం శ్రీలంక తీవ్రంగా శ్రమిస్తోంది. చైనా వంటి కొత్త మిత్రులు సహకరిస్తున్నా భారత్‌ ఈసారి లంకకు మద్దతిస్తుందా లేదా అన్నది తేలలేదు. చైనా, రష్యాతో పాటు పాకిస్తాన్‌ వంటి ముస్లిం దేశాలు లంకకు మద్దతిచ్చే అవకాశముంది. ఈ మేరకు ప్రపంచ ముస్లిం దేశాల అధినేతలకు అధ్యక్షుడు రాజపక్సేతో పాటు ఆయన సోదరుడు మహీంద కూడా ఫోన్లు చేస్తున్నారు.

తమిళ ఎన్నికల వేళ గైర్హాజరుకే భారత్‌ మొగ్గు

తమిళ ఎన్నికల వేళ గైర్హాజరుకే భారత్‌ మొగ్గు

శ్రీలంక తమ 13వ రాజ్యాంగ సవరణకు కట్టుబడి తూర్పు, ఉత్తర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తే తాము ఈ తీర్మానానికి మద్దతిస్తామని భారత్‌ చెబుతోంది. కానీ ఇందుకు లంక ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. భారత ప్రధాని మోడీతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స గతంలో జరిపిన చర్చల్లో ఈ మేరకు హా్మీ ఇచ్చేందుకు వారు అంగీకరించలేదు. దీంతో భారత్‌ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు కూడా ఉంది. భారత్ ఈ తీర్మానానికి మద్దతిస్తే తమిళనాడులో ప్రత్యర్ధుల నుంచి బీజేపీకి విమర్శలు తప్పవు. దీంతో ఇవాళ శ్రీలంకకు వ్యతిరేకంగా ఐరాసలో జరిగే ఓటింగ్‌కు మద్దతివ్వలేక, అలాగని వ్యతిరేకించలేక గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక కూడా ఇదే అంచనా వేస్తోంది.

English summary
The vote on a critical resolution against Sri Lanka at the UN Human Rights Council (UNHRC) in Geneva has been postponed to Tuesday, as Colombo stepped up efforts to garner international support ahead of the voting which is being seen as an acid test for President Gotabaya Rajapaksa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X