Viral video:వావ్..డాగ్ ఫీట్, కర్ర తీసుకొని రాగా, ఫ్రెండ్ హెల్ప్, వైరల్, డివైడ్ టాక్
ఏం జరిగిన చిటికెలో తెలుస్తోంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. అలా ఓ శునకం కూడా పారే నీటిలో సాహసమే చేసింది. అయితే అక్కడ రెండు శునకాలు ఉన్నాయి. జనం కూడా ఉన్నారు. ఓ కర్రను పాడేసి.. తీసుకురావాలని కోరడంతో ఇదీ జరిగింది. మరో డాగ్.. దానికి సాయం చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కర్రను తీసుకొచ్చే క్రమంలో బాలెన్స్ కోల్పోయింది. అక్కడే ఉన్న మరో శునకం దానిని కాపాడింది. వీడియోను గాబ్రియేల్ కార్నే షేర్ చేశారు. తెగ ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తోటి శునకం సాయం చేయడంపై కొందరు ప్రశంసించారు. మరికొందరు మాత్రం అదేం లేదని కామెంట్ చేశారు. సందేహాలు వ్యక్తం చేశారు.
Dog Saves Friend from Drowning pic.twitter.com/3aE07tUN5p
— Gabriele Corno (@Gabriele_Corno) September 26, 2022
ఆ వీడియో తీసిన వ్యక్తి ఎందుకు సాయం చేయలేదు అని ఓ నెటిజన్ అడిగారు. సాయం చేయడానికి బదులు వీడియో తీయడమే ఇంపార్టెంట్ అని అతను అనుకున్నాడా అని మరొకరు రాశారు. అలా జరిగేందుకు అలా ఉన్నారా అని మరొకరు అభిప్రాయపడ్డారు. సదరు వ్యక్తి వీడియో తీస్తుండగా.. మరో డాగ్ సాయం చేసిందని ఒకరు అన్నారు.

మరికొందరు ఇదీ కావాలని చేసిన సెటప్ అని అంటున్నారు. ఆ శునకానికి తగిన సమయంలో సాయం చేయకపోయి ఉంటే పరిస్థితి ఏంటీ అని అడిగారు. మునిగితే ఎవరూ కారణం అని అడిగారు. ఇలా నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.












Click it and Unblock the Notifications