viral video:గజరాజు సూపర్.. తొండంతో షూ తీసిచ్చి, వైరల్
గజరాజు అంతే అందరికీ భయమే.. మవాటి ఉంటేనే కాస్త ధైర్యంతో ఉంటారు. గజరాజులో అడవీతోపాటు.. జూ లలో కూడా ఉంటాయి. వాటి ఎన్ క్లోజర్‌లోకి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయరు.. అయితే డ్రాగన్ కంట్రీ చైనాలో గల ఓ జూలో పొరపాటున షూ పడిపోయింది. ఆ గజరాజు తన తొండంతో షూను అందజేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
చైనాకు చెందిన ఓ ఫ్యామిలీ అంతా కలిసి షాంగ్ డోంగ్ ప్రావిన్స్‌లో గల జూకు వెళ్లింది. జంతువులను చూస్తూ ఏనుగులు ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లారు. నేలకు దిగువన కాస్త లోతుగా తవ్విన గుంతలాంటి ఎన్ క్లోజర్‌లో ఏనుగులు ఉన్నాయి. నిలబడి వాటిని చూస్తుండగా.. ఓ చిన్నారి షూ ఆ ఎన్ క్లోజర్‌లో పడిపోయింది. అది గమనించిన ఏనుగు.. మెల్లగా తన తొండంతో షూను పట్టుకుని తీసి.. పైన నిలబడి చూస్తున్న వారికి అందజేసింది.
ఆ షూను తీసుకున్న పిల్లలు.. కొంత గడ్డిని ఆ ఏనుగుకు ఇచ్చారు. ఏనుగు ఆ గడ్డిని తినేస్తూ వెనుదిరిగింది. అక్కడున్న కొందరు వీడియో తీశారు. ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశారు. చిన్నారి షూను తీసిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల కొద్దీ వ్యూస్, లైకులు వచ్చాయి. ఆ ఏనుగును సరిగా చూసుకుంటున్నారు, అందుకే పద్ధతిగా వ్యవహరిస్తోందనికామెంట్ చేశారు. ప్రపంచానికి ఏనుగులను ఇన్ చార్జులుగా పెడితే బాగుపడుతుందని మరికొందరు అంటున్నారు.

అంత తెలివైన గజరాజును బంధించాం అని మరొకరు రాశారు. చాలా మంది కామెంట్స్ చేశారు. ఏనుగు చేసిన పనిని కొనియాడారు. వావ్, సూపర్ అంటూ రాశారు. మీరు కూడా ఆ వీడియోను చూడండి.












Click it and Unblock the Notifications