అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నోరూరించే పిజ్జా రుచులు... (వీడియో)
వాషింగ్టన్: వేడి వేడిగా పిజ్జా తింటుంటే.. అబ్బ ఆ రుచే వేరు! మన సంగతి సరేగానీ, పాపం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉండే వ్యోమగాముల పరిస్థితేంటి? భూమ్మీదికి తిరిగొచ్చేదాకా పిజ్జా రుచి చూడలేరా?
అంతరిక్ష కేంద్రంలో నివసించే వ్యోమగాములకు మనలాగ ఏది పడితే అది తినే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు అక్కడ ఉన్నన్నిరోజులు చాలా ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది.
అందుకోసం వారు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకుంటారు. అయితే, అప్పుడప్పుడు వారి నాలుక కొత్త రుచుల కోసం వెంపర్లాడుతుంటుంది. ప్రస్తుతం అక్కడున్న ఇటాలియన్ వ్యోమగామి పావులో నెస్పోలీకి పిజ్జా తినాలని బహు కోరిక.
When you really, really miss pizza... you CASUALLY mention it to the International @Space_Station Boss during a live public event 😉 Thank you Kirk for surprising us with unexpectedly delicious pizzas! #VITAmission pic.twitter.com/WstvG3IKr1
— Paolo Nespoli (@astro_paolo) December 2, 2017
పాపం ఆయన తన ట్వీట్లలో ఎక్కువగా పిజ్జా గురించే ప్రస్తావిస్తుంటాడు. 'నాకు పిజ్జా తినాలనుంది, మేఘాలను చూస్తుంటే పిజ్జా గుర్తొస్తోంది..' అంటూ ట్వీట్లు చేస్తుంటాడు.
ఇటీవల ఓ లైవ్ మానిటరింగ్ సెషన్‌లో కూడా తాను పిజ్జాను బాగా మిస్ అవుతున్నానని పావులో చెప్పాడు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఇటీవల ఐఎస్ఎస్‌కు ఆహారం సరఫరాలో భాగంగా వారికి పిజ్జా తయారు చేసుకునే పదార్థాలను పంపింది.
ఇంకేం, వ్యోమగాముల ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్లూ డీహైడ్రేట్ ఆహారం తిని తిని చప్పబడిపోయి ఉన్న నాలుకకు కొత్త రుచిని తగిలించారు. వారు పిజ్జా తయారు చేసుకుని, గాల్లో ఎగురుతున్న పిజ్జాలను తింటూ ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు.. వారి ఆనందాన్ని పంచుకుంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. మీరూ చూడండి మరి!
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications