
VIRAL:అదీ పిల్లి కాదు సింహాం, దాడి చేయగల, లయన్‌తో ఉమెన్, వైరల్
క్రూర జంతువుల అంటే అందరికీ భయమే. పులి, సింహాం అంటే భయమే.. కానీ వాటితో ఆటలు అంటే మామలు విషయం కాదు. కొందరు పైథాన్ పెంచుకుంటున్నారు. మరికొందరు మొసళ్లతో ఆడుకుంటారు. విదేశాల్లో పులులతో కొందరు ఫోటోలు దిగుతుంటారు. మరికొందరు వీడియోలను షేర్ చేస్తుంటారు. మరీ సింహాలతో.. ఓహ్ నో.. అలాంటిదేం లేదు.. కానీ ఓ మహిళ మాత్రం సింహాంతో సరదాగా ఆడింది. ఆ వీడియోను మీరు చూడండి.

బోనులో సింహాం ఉన్న..
సింహాం బోనులో ఉన్న కాస్త దూరం నుంచే చూస్తుంటారు. కానీ జూ కీపర్స్, హ్యాండ్లర్స్, ఓనర్స్ మాత్రం క్రూర జంతువులతో కలిసి ఉండాలి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రిచ్ పీపుల్.. పులులలతో మచ్చికగా ఉంటారు. వీడియోలో ఓ మహిళ సింహాంతో ఉన్న పీక్ చూడొచ్చు. ఆమె లొకేషన్ ఎక్కడ తెలియలేదు. కానీ ధైర్యాన్ని మాత్రం ప్రశంసించకుండా ఉండలేం.

సింహాం తల నిమురుతూ..
ఆ వీడియోలో సింహాం పక్కనే మహిళ ఉంది. దానిని తల నిమరడాన్ని కూడా మనం చూడొచ్చు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆమె పాకిస్థాన్‌కు చెందినవారని కొందరు అంటున్నారు. ఆ సింహాం గొలుసులతో కట్టివేసిందని.. మంచం మీద విశ్రాంతి తీసుకుంటుందని అంటున్నారు. దాని పక్కనే మరో సింహం కూడా ఉంది. వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మహిళ సింహాం తల నిమిరిన సమయంలో.. అదీ అవలింత తీయడం మనం చూశాం.
పిల్లి కాదు..
వీడియోను కే4 ఖలీల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే 449 కే వ్యూస్ వచ్చాయి. 23 వేల లైకులు వచ్చాయి. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కొంచెం కూడా భయపడకుండా ఉందని అంటున్నారు. అదీ సింహాం.. పిల్లి కాదని ఒక యూజర్ రాశారు. ప్రేమ మీ ప్రాణాలను తీయగలదు అని మరొకరు రాశారు.
ఇలా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ధైర్యంగా ఉన్నావని చాలా మంది రాశారు. వావ్ యువర్ గ్రేట్ అని అంటున్నారు. నిజమే.. ఆమె సింహాంతో ఏ మాత్రం భయం లేకుండా ఉన్నారు. పిల్లి, పెట్ డాగ్ మాదిరిగా గడిపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.