వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ అనుకున్నది చేసింది: షరీఫ్‌కు పాక్ మీడియా హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాక్‍‌లో ప్రభుత్వానికి, మీడియాకు మధ్య నడుస్తున్న యుద్ధం ఉధృతమైంది. పాక్ ప్రభుత్వ, భద్రతా బలగాల గొంతుకగా ది నేషన్ పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన విరుచుకు పడింది. అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అవుతున్నా మనకు కించిత్ బాధ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు ప్రతిగా పాకిస్తాన్‌ను భారత్ ఏం చేయాలనుకుందో ఆ పనిని (అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిని) చేసిందన్నారు. దానిని అడ్డుకోవడంలో పాక్ అడుగడుగునా విఫలమవుతోందని నిప్పులు చెరిగింది. యూరి ఉగ్రదాడి అనంతరం పాక్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్న భారత్.. కొద్ది గంటల కిందట గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులోను పాక్ ఉగ్రవాదాన్ని తల్లిలా పెంచి పోషిస్తోందని విమర్శించిందని పేర్కొంది.

pakistan

అంతకుముందు సార్క్ సమావేశాన్ని బహిష్కరించిందని, మరో ఏడు దక్షిణాసియా దేశాలు భారత్‌ను సమర్థిస్తూ మనకు దూరమయ్యాయని పేర్కొంది. పాక్‌ను భారత్ ఏకాకిని చేసిందని, ఇలాంటి పరిస్థితిల్లో మనం విధానాలను మార్చుకోవాలని హితవు పలికింది. ప్రపంచంలో మనల్ని భారత్ ఏకాకిని చేసిందని హెచ్చరికించింది.

English summary
'We are on verge of global isolation', Pakistani media warns government and security agencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X