Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా అంతిమ లక్ష్యం అదే..: అంతర్జాతీయ వేదికపై మోదీ

జొహాన్నెస్‌బర్గ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ఈ తెల్లవారు జామున ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. సాయంత్రం జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాలతో మోదీకి స్వాగతం పలికారు.

జొహాన్నెస్‌బర్గ్‌లో ఉన్న ఆర్య సమాజ్ ప్రతినిధులు మోదీని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. మహిళలు ఆయనకు రాఖీ కట్టి గౌరవించుకున్నారు. వారితో గ్రూప్ ఫొటో దిగారు. చిన్నపిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సమావేశానికి హాజరయ్యారు.

PM Modi

ఈ సమావేశంలో మోదీ ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా ఆవిర్భవింపజేయడానికి కృషి చేస్తోన్నామని అన్నారు. త్వరలోనే అయిదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచానికే గ్రోత్‌ ఇంజిన్‌గా నిలుస్తామని చెప్పారు.

ప్రకృతి వైపరీత్యాలు, కొన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిలిచామని, ఆర్థిక శక్తిగా ఎదగడానికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకుందని మోదీ చెప్పారు. కఠిన పరిస్థితులను ఆర్థిక సంస్కరణలుగా మార్చడం వల్లే ఇది సాధ్యపడిందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా.. వంటి నినాదాలతో ముందుకు వెళ్తోన్నామని గుర్తు చేశారు.

పెట్టుబడులు పెట్టడానికి అనువైన దేశంగా మార్చడంలో సఫలీకృతులం కాగలిగామని మోదీ చెప్పారు. సంక్షేమ పథకాల డెలివరీ మెకానిజం, సుపరిపాలనపై దృష్టి సారించామని, అవి సత్ఫలితాలను ఇస్తోన్నాయని మోదీ పేర్కొన్నారు. నగరాల నుంచి గ్రామస్థాయి వరకు యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు నమోదు కావడానికి సుపరిపాలనే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.

PM Modi

వీధి వ్యాపారులు మొదలుకుని షాపింగ్ మాల్స్‌కు వరకు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తోన్నారని మోదీ ఉదహరించారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. జీఎస్టీని అమలులోకి తీసుకుని రావడం వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు.

రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రైవేట్‌కు అవకాశాలను కల్పించామని ఫలితంగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెరిగాయని అన్నారు. సౌరశక్తి, పవన శక్తి, విద్యుత్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో భారత్.. అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చడానికి తాము అనేక విప్లవాత్మక చర్యలను తీసుకుంటోన్నామని ఆయన వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+