బ్రిటన్ రాణి మృతికి ముందు ఏం జరిగింది ? తాజా మాజీ ప్రధానులతో భేటీ..
బ్రిటన్ రాణిగా 73 ఏళ్ల పాటు పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 గత కొంతకాలంగా వయోభారం కారణంగా ఎవర్నీ కలవడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. తాజాగా వేసవి విడిది కోసం బల్మోరల్ క్యాజిల్ కు వెళ్లారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచారు. అయితే బల్మోరల్ క్యాజిల్ లో విశ్రాంతి తీరుతున్న సమయంలోనూ ఆమె ఎవర్నీ కలిసేందుకు ఇష్టపడలేదు. కానీ చివరిగా బ్రిటన్ తాజా, మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్ తో మాత్రం భేటీ అయ్యారు.
క్వీన్ ఎలిజబెత్ కొంతకాలంగా అనారోగ్యంగానే ఉన్నారు. దీంతో ఆమె ఎక్కువ మందిని కలిసేందుకు అవకాశం లేకుండా పోయింది. విదేశీ పర్యటనల్ని దశాబ్దం క్రితమే మానుకున్న ఎలిజబెత్ బ్రిటన్ లో ఉంటున్నా అపాయింట్ మెంట్లు కూడా తగ్గించుకుంటూ వచ్చారు. చివరికి బల్మోరల్ క్యాజిల్ కు వేసవి విడిది కోసం చేరుకున్న తర్వాత తాజాగా బ్రిటన్ లో ప్రధాని పదవికి ఎన్నికలు జరిగాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో భారతీయ మూలాలున్న రిషి సునాక్ ను కాదని ఓటర్లు లిజ్ ట్రస్ ను గెలిపించారు. దీంతో లిజ్ ట్రస్ ను ప్రధానిగా నియమించాల్సిన బాధ్యత రాణిపై పడింది.
దీంతో రాణిని లిజ్ ట్రస్ కలుసుకున్నారు. మాజీ ప్రధాని బోరిస్ కూడా అక్కడికి వచ్చారు. దీంతో బోరిస్ జాన్సన్ నుంచి అధికారికంగా లిజ్ ట్రస్ కు రాణి పగ్గాలు అప్పజెప్పారు.

అనంతరం పార్లమెంటు జరుగుతున్న సమయంలో డాక్టర్లు రాణి ఆరోగ్య పరిస్ధితి క్షీణించినట్లు ప్రధాని లిజ్ ట్రస్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె పార్లమెంటులో ఎనర్జీ బిల్లుపై చర్చ జరుగుతుండగానే దాన్ని నిలిపివేసి ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఎంపీలు కూడా షాకయ్యారు. రాణి ఆరోగ్యంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. నిమిషాల వ్యవధిలో సింహాసనం వారసుడైన ప్రిన్స్ చార్లెస్ కార్యాలయం, అయన, భార్య కెమిల్లాతో కలిసి అప్పటికే బాల్మోరల్ ఎస్టేట్‌లో ఉన్నారని ప్రకటించారు. ఆ తర్వాత స్కాట్లండ్ లోనే ఉన్న రాణి కుమార్తె ప్లిన్స్ అన్నే కూడా చేరుకున్నారు.
గురువారం మధ్యాహ్నం రాణి మరణించినప్పుడు వీరిద్దరూ ఆమె పక్కనే ఉన్నారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications