అమెరికాపై ఉ.కొరియా.. క్షిపణి ప్రయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఉత్తరకొరియా, అమెరికాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాము యుద్ధానికి సిద్ధమేనంటూ వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కూడా ఉత్తరకొరియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరకొరియా ముప్పు: భారత సాయం కోరిన అమెరికా

ఒక వేళ ఉత్తరకొరియా అమెరికాపై గానీ, అమెరికాకు మిత్ర దేశాలపైనా గానీ దాడికి పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రపంచం కూడా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే అమెరికాపై క్షిపణి ప్రయోగిస్తామని ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ బెదిరింపులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.

నిమిషాల్లో తెలిసిపోతుంది..

నిమిషాల్లో తెలిసిపోతుంది..

ఈ నేపథ్యంలో న్యూక్లియర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్, గ్లోబల్ జీరో కో-ఫౌండర్ బ్రూస్ బ్లెయిర్ స్పందించారు. ఆయన వన్ఇండియాతో మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఉత్తరకొరియా అమెరికాపై లేదా అమెరికా మిత్రదేశాలపై క్షిపణులు ప్రయోగిస్తే.. ఆ విషయం నిమిషాల్లోనే అమెరికాకు తెలిసిపోతుంది యూఎస్ సెటిలైట్ల ద్వారా' అని తెలిపారు.

అత్యసవర సమావేశం

అత్యసవర సమావేశం

‘అలస్కా, కాలిఫోర్నియాల్లో మిసైల్ డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్ లలో కూడా ఉన్నాయి. వీటి ద్వారా క్షిపణుల ప్రయోగాల విషయం తెలిసిపోతుంది. దీంతో స్ట్రాటజిక్ కమాంట్(నియర్ ఓమాహ్), ప్రెసిడెంట్, అగ్ర సలహాదారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటారు' బ్రూస్ అని తెలిపారు.

ఆదేశాలు వస్తే చాలు

ఆదేశాలు వస్తే చాలు

‘ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. కొద్ది నిమిషాల్లోనే అమెరికా సైన్యం అప్రమత్తమవుతుంది. ఆదేశాలు వస్తే చాలు ఉత్తరకొరియాపై యుద్ధానికి సిద్దంగా ఉంటాయి. దేశంలోని అధ్యక్షుడు, ముఖ్య నేతలను సురక్షితంగా ఉంచే యత్నాలు జరుగుతాయి, అన్ని రక్షణశాఖలు అప్రమత్తంగా ఉంటాయి' అని బ్రూస్ వివరించారు.

ప్రెసిడెంట్ రక్షణ, ప్రజలనుద్దేశించి..

ప్రెసిడెంట్ రక్షణ, ప్రజలనుద్దేశించి..

‘ఒక వేళ ప్రెసిడెంట్ వైట్ హౌజ్‌లో ఉన్నట్లయితే అక్కడ్నుంచి ఆయన్ను బ్రాస్ట్ ప్రూఫ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కు హెలికాప్టర్ ద్వారా తరలించడం జరుగుతుంది. అధ్యక్షుడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. రేడియో, టీవీల ద్వారా అప్రమత్తం చేయడం జరుగుతుంది' అని బ్రూస్ బ్లెయర్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
What if North Korea launches a missile at the US or allied territory? The threat is looming large and the world watches these developments with fear. ఒక వేళ ఉత్తరకొరియా అమెరికాపై గానీ, అమెరికాకు మిత్ర దేశాలపైనా గానీ దాడికి పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రపంచం కూడా ఆందోళన చెందుతోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి