ఛీ దీనమ్మా.. ఇదేం టీనేజ్ అమ్మాయిరా బాబూ..! పబ్లిక్ గా ఆ పని చేయడానికి ఏం సిగ్గుపడదట..?

పెన్సిల్వేనియా/హైదరాబాద్ : కొంత మంది కొన్ని అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అది వారి వ్యక్తిగతానికి పరిమితమైతే పరవాలేదుగాని జన సమూహంలో ఆ అలవాటును ప్రదర్శిస్తేనే ఇబ్బందిగా మారుతుంది. కొన్ని సార్లు జనాలకు అదే అలవాటు చికాకు తెప్పిస్తుంటుంది కూడా. టీనేజ్ లో కొన్ని పనులు స్వతహాగా సరదాగా అనిపించినా వాటికి కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోయి సామాన్య ప్రజానికానికి లేని పోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటారు కొంత మంది.

ఉన్నత చదువులు చదువుకున్న కొంత మంది విపరీత చేష్టలు కూడా సభ్యసమాజంలో ఇబ్బందిగా మారితుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓ టీనేజ్ అమ్మాయి వింత అలవాటు ఔరా అనిపించింది. ముఖ్యంగా నిత్యావసర సరుకులు లభించే మాల్స్ లో ఆ పని చేయడం ఆ అమ్మాయి అలవాటుగా మారిందని చెప్పుకురావడం కొసమెరుపు.

What is shame to do that in public places..?

అమెరికాలో ఓ యువతి షాపింగ్ మాల్ లో చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. ఇంకా పబ్లిక్ ప్రదేశాల్లో అలాంటి పని చేయడం ఆమెకి అలవాటని తేలడం కొస మెరుపు.... వివరాల్లోకి వెళితే పెన్సిల్వేనియాకు చెందిన ఓ యువతి ప్రముఖ రిటైల్ స్టోర్ వాల్ మార్ట్ కు వెళ్లింది. అక్కడే ఉన్న బంగాళదుంపలపై మూత్ర విసర్జన చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. అయితే ఈ మొత్తం ఘటన స్టోర్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.

ఈ యువతి చేసిన పనితో దిమ్మతిరిగిన స్టోర్ యాజమాన్యం పోలీసులు ఫిర్యాదుచేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యువతిని గుర్తించారు. ఆమె పేరు గ్రేస్ అని, పబ్లిక్ ప్రదేశాల్లో ఇలా చేయడం ఆమె అలవాటని తెలిపారు. గతంలో కూడా ఆమె ఇలాంటి పనులు చేసిందని పోలీసుల పరిశోధనలో తేలింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో అదేం పని అని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+