10లక్షల వాట్సాప్ వినియోగదారుల డేటా చోరీ చేసిన చైనా సంస్థలు; న్యాయపోరాటానికి దిగిన మెటా!!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫాం అయిన వాట్సాప్ మాతృసంస్థ మెటా 10 లక్షల వాట్సాప్ ఖాతాల వివరాలను చైనా సంస్థలు చోరీ చేశాయని న్యాయ పోరాటానికి దిగింది. వాట్సాప్ మాతృసంస్థ మెటా చైనా సంస్థలు తమ వాట్సప్ వినియోగదారులకు ఖాతాల డేటాను చోరీ చేశారని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్ట్ లో దావా వేసి న్యాయ పరమైన చర్యలకు ఉపక్రమించింది.

మూడు చైనీస్ సంస్థలపై వాట్సాప్ మాతృ సంస్థ మెటా న్యాయపోరాటం
చైనీస్ కంపెనీలూ హేయ్ మోడ్స్, హేయ్ వాట్సాప్ మరియు హైలైట్ మోబి పేరుతో ఈ సంస్థలు అనధికార వాట్సాప్ గా చలామణి అవుతున్నట్టు గత కొంతకాలంగా ఆరోపణలు వస్తుండగా, మే ఒకటవ తేదీ నుండి ఒక మిలియన్ కంటే ఎక్కువ వాట్సప్ ఖాతాల డేటాను చోరీ చేయడానికి వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ లను అభివృద్ధి చేసి, ఇవి డేటా చోరీ చేశాయని మెటా అభియోగాలు మోపినట్టు బ్లీపింగ్ కంప్యూటర్ తెలిపింది.

హానికరమైన మాల్వేర్ లతో నకిలీ వాట్సాప్ యాప్ లు
ఇక వీటి ప్రధాన కార్యాలయాలు చైనా లో ఉన్నట్లు తెలియడంతో, ఈ నకిలీ వాట్సాప్ యాప్ ల గురించి గత కొంత కాలంగా యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్న వాట్సాప్ వీటిపై న్యాయ పోరాటానికి దిగింది. ఈ నకిలీ వాట్సాప్ యాప్ లు కంపెనీల సైట్‌ల నుంచే కాకుండా , గూగుల్ ప్లే స్టోర్, ఏపీకే ప్యూర్ మరియు ఇతర యాప్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయని, సున్నితమైన డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ సామర్థ్యాలతో కూడిన మాల్వేర్‌లను కలిగి ఉన్నాయని, ఇది వాట్సాప్ ఖాతా హైజాకింగ్‌ను అనుమతించగలదని మెటా తన ఫిర్యాదులో తెలిపింది.

యాప్ ల ద్వారా వినియోగదారుల డేటా చోరీ
ఈ యాప్ ల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడానికి హానికరమైన అప్లికేషన్లను ప్రోగ్రాం చేశారని మెటా ఆరోపించింది. హేయ్ మోడ్స్, హేయ్ వాట్సాప్ మరియు హైలైట్ మోబి వంటి సవరించిన వాట్సాప్ వెర్షన్లను డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్త పడాలని వినియోగదారులను గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది వాట్సాప్. ఈ యాప్ లు కొత్త ఫీచర్లను అందిస్తామని చెప్పి, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడానికి స్కామ్ చేస్తున్నాయని మెటా పేర్కొంది.

నకిలీ యాప్ లపై మెటా కోర్టులో న్యాయపోరాటం
అదనపు ఫీచర్ల పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నాయని పేర్కొంది. తాము ఇప్పటివరకు గుర్తించిన వాటిని ఇప్పటికే తాము గూగుల్ తో పంచుకున్నామని, గూగుల్ ప్లే ప్రొటెక్ట్, ఆండ్రాయిడ్ ల సహాయంతో ఈ నకిలీ యాప్ ల తొలగింపుకు కృషి చేస్తామని మెటా వెల్లడించింది. ఇదే సమయంలో కోర్టులో దావా వేసి న్యాయపోరాటం చెయ్యనుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications