వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో వాట్సాప్‌తో వీడియో కాల్: ఫేస్‌బుక్‌కి పోటీగా గూగుల్ యాప్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

త్వరలో వాట్సాప్‌లో వీడియో కాల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజ్‌ సర్వీసింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ఇప్పటికే ఆడియో కాల్స్ వాట్పాప్ ద్వారా చేసుకోవచ్చు. త్వరలో వీడియో కాల్స్ కూడా వచ్చే అవకాశముంది.

వాట్సాప్‌ను ఉపయోగించే వారి సంఖ్య 90 కోట్లు దాటింది. ప్రజలు ఇంతలా ఉపయోగిస్తున్న వాట్సాప్‌లో స్కైప్, హ్యాంగ్ఔట్స్‌లో వలె వీడియోకాలింగ్‌ సదుపాయం లేదు. దీనిని భర్తీ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే వాట్సాప్‌లో వీడియోకాలింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు.

ప్రస్తుతం ఇది పరీక్ష దశలో ఉందని చెబుతున్నారు. త్వరలో విడుదల చేయనున్న ఐఓఎస్‌ వర్షన్‌లో ఈ వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక జర్మన్‌ వెబ్‌సైట్‌ ధ్రువీకరించింది.

ఐఓఎస్‌ వర్షన్‌ వీడియో కాలింగ్‌ని పరీక్ష చేస్తుండగా తీసిన కొన్ని స్క్రీన్ షాట్స్‌ని ఆ వెబ్‌సైట్‌ విడుదల చేసింది. ఈ స్క్రీన్ షాట్స్‌ ఆధారంగా వీడియో కాల్‌ మాట్లాడుతూనే ఫొటోలు కూడా తీసే అవకాశం ఉంది. అంతేకాదు, వాట్సాప్ మల్టిపుల్ చాట్ ట్యాబ్స్‌ను తీసుకు రానుందట.

WhatsApp video calling could be coming soon

ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ మెసేజింగ్ యాప్!

ఇదిలా ఉండగా, ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ సరికొత్త మెసేజింగ్ యాప్‌తో ముందుకు రాబోతోంది. దీని కోసం గూగుల్ సంస్థ దాదాపు ఏడాది కాలంగా కసరత్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం తెలిపింది. గూగుల్ మెసేజింగ్ యాప్ హ్యాంగ్ఔట్ ఆశించినంత మేర యూజర్లను ఆకట్టుకోలేకపోవడంతో గూగుల్ ఈ ప్రయత్నాన్ని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

కొత్త మెసేజింగ్ యాప్‌లో ఫేస్‌బుక్‌ను తలదన్నేలా యూజర్లకు అన్ని రకాల ఫీచర్లను అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. ఇందుకోసం గూగుల్ సెర్చింజన్లో ఉండే ఫీచర్లను, వెబ్ పేజ్ లింకులు యూజర్లకు యాప్‌లో అందుబాటులో ఉండేలా రూపొందిస్తోంది. ఇది ఎప్పటికి అందాబుటులోకి రానుందనే విషయం తెలియాల్సి ఉంది.

English summary
WhatsApp, the messaging app owned by Facebook, could soon be adding video calling to its list of features.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X