ఇథియోపియా క్రైస్తవుల తలలు నరికిన ఐసిస్, వీడియో విడుదల
సిరియా: ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు ఇటీవల లిబియాలో 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను చంపుతున్న వీడియోలను విడుదల చేసింది. బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన 29 నిమిషాల నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు.
క్రైస్తవులు ముస్లీంలను మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ముసుగు ధరించిన ఉగ్రవాదులు 12 మంది క్రైస్తవ బందీలను సముద్ర తీర ప్రాంతంలో తలలు నరికేస్తున్న వీడియో తీశారు.

16 మందిని ఎడారి ప్రాంతంలో తుపాకులతో కాల్చి చంపేసిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇంకా ఎంతమందిని చంపారనే దాని పైన స్పష్టత రావాల్సి ఉంది.
వైట్ హౌస్ ఖండన
28 మంది ఇథియోపియా క్రైస్తవులను దారుణంగా చంపేసిన ఐసిస్ తీరును వైట్ హౌస్ ఆదివారం నాడు తీవ్రంగా ఖండించింది. మృతి చెందిన కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఇథియోపియా ప్రభుత్వానికి తాము అండగా నిలబడతామని ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications