ట్రంప్ ఎఫెక్ట్: ఇన్ఫోసిస్ సంచలనం, 10వేల ఉద్యోగాలు అమెరికన్లకే

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: రానున్న రెండేళ్లలో పదివేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇన్ఫోసిస్ నిర్ణయం తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఈ మేరకు దీనిని స్వాగతిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇది ట్రంప్‌ రాజకీయ విజయమని పేర్కొంది.

భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ రానున్న రెండేళ్లలో అమెరికాలో 10 వేలమంది అమెరికన్లను ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పింది. దీంతో పాటు మరో నాలుగు టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపింది.

ఆగస్ట్ కల్లా ఇండియానాలో తొలి హబ్

ఆగస్ట్ కల్లా ఇండియానాలో తొలి హబ్

హెచ్‌1బీ వీసాల ఆందోళనల నేపథ్యంలో సంస్థ సీఈవో విశాల్‌ సిక్కా ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు కల్లా ఇండియానాలో తొలి హబ్‌ను ఏర్పాటు చేసి తద్వారా రెండు వేల ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు. దీనిని వైట్ హౌస్ స్వాగతించింది.

ట్రంప్ ఎఫెక్ట్

ట్రంప్ ఎఫెక్ట్

ఇది ట్రంప్‌ ప్రభుత్వ సానుకూల ఆర్థికాభివృద్ధి అజెండా ఫలితమని ఒక ప్రకటనలో వైట్ హౌస్ పేర్కొంది. ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం అవుతుందన్నందుకు సంతోషిస్తున్నామని చెప్పింది.

అమెరికా ఆరోపణలు..

అమెరికా ఆరోపణలు..

కొంతకాలంగా హెచ్‌1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి భారతీయ కంపెనీలు హెచ్‌-1బీ వర్క్‌ వీసాల్లో ఎక్కువ భాగాన్ని కైవసం చేసుకోవడం అన్యాయమని ఆరోపించింది.

ఖండించిన నాస్కామ్

ఖండించిన నాస్కామ్

ఏటా అమెరికా 65వేల హెచ్‌1బీ వీసాలను అనుమతి ఇస్తుండగా మరో 20వేల వీసాలను ఇతరత్రా అవసరాల కోసం పక్కన పెడుతోంది. అయితే అమెరికా ఆరోపణలను భారత ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ ఖండించింది. 2014-15లో అనుమతించిన వీసాల్లో ఇన్ఫీ, టీసీఎస్‌ వాటా 8.8శాతం మాత్రమేనని తెలిపింది.

పదివేల ఉద్యోగాలతో ఇన్ఫోసిస్ సంచలనం

పదివేల ఉద్యోగాలతో ఇన్ఫోసిస్ సంచలనం

మరోవైపు, డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ ప్రభావం భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌పై పడింది. ట్రంప్‌ నిర్ణయంతో ఇన్ఫోసిస్ ఉద్యోగుల విషయంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అదే రానున్న రెండేళ్లలో పదివేల మంది అమెరికన్లను ఉద్యోగులుగా నియమించుకోవడం.

వీసా సమస్యలు లేకుండా..

వీసా సమస్యలు లేకుండా..

ఉద్యోగుల నుంచి వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ నియామకాలతో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ అండ్‌ బిగ్‌ డేటాపై కూడా ఇన్ఫోసిస్‌ దృష్టి పెట్టనుంది.

2021కల్లా..

2021కల్లా..

ఈ ఏడాది ఆగస్టులో ఇండియానాలో తొలి హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశాల్ సిక్కా చెప్పారు. ఈ హబ్‌ ద్వారా 2021 నాటికి అమెరికన్లకు 2వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. మిగతా మూడు హబ్‌లను ఎక్కడ ఏర్పాటు చేస్తామన్నది సంస్థ త్వరలోనే వెల్లడిస్తుందన్నారు.

కేవలం హెచ్1బీ వీసా కారణంగానే కాకుండా...

కేవలం హెచ్1బీ వీసా కారణంగానే కాకుండా...

అయితే కేవలం వీసా సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోలేదని విశాల్ సిక్కా తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, వర్చువల్‌ రియాల్టి లాంటి టెక్నాలజీ వినియోగం పెరిగిందని, ఈ నేపథ్యంలో స్థానికులు, విదేశీ ఉద్యోగులు కలిసి పని చేస్తే మంచి ఫలితాలొస్తాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The White House termed the Infosys decision of hiring 10,000 Americans a political victory for the Trump administration.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి