వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త వేరియంట్ పేరు ఒమిక్రాన్.. అలర్ట్‌గా ఉండాలన్న డబ్లూహెచ్‌వో

|
Google Oneindia TeluguNews

కొత్త కరోనా వేరియంట్ గజ గజ వణికిస్తోంది. ఇదీ సార్స్ కొవ్-2 అని.. ఆఫ్రికాలోని బొట్స్వానాలో తొలుత వెలుగుచూసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీని పేరు ఓమిక్రాన్‌గా నామకరణం చేశారు. వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీన గుర్తించామని వివరించారు. వైరస్ తొలుత సౌతాఫ్రికాలో బయటపడింది. అయితే ఈ నెల 9వ తేదీన లక్షణాలు బయటకు వచ్చాయని వివరించింది. ఇదీ చాలా మ్యూటేషన్స్ ఉంటాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశమే.

కొత్త వేరియంట్‌ను B.1.1.529 అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించడం ముఖ్యం.

 WHO designates Omicron as variant of concern

Recommended Video

CM Jagan భారీ స్కెచ్.. AP Capital అభివృద్ధి కోసం 50 వేల కోట్ల రుణం! || Oneindia Telugu

ప్రయోగశాలలో శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయి. కానీ, వాస్తవ ప్రపంచంలో వైరస్‌ను పర్యవేక్షించడం ద్వారా జవాబులు మరింత త్వరగా వస్తాయి. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఆందోళనలకు కారణమయ్యే అంశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో 77 కేసులు, బోట్స్వానాలో నాలుగు కేసులు, హాంకాంగ్‌లో ఒకటి (సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి) బయటపడ్డాయి. వీరందరికీ కొత్త వేరియంట్ కారణంగానే కోవిడ్ సోకినట్లు స్పష్టమైంది.

English summary
World Health Organisation has designated B.1.1529 as a ‘variant of concern’. The variant of SARS-CoV-2, first detected in Africa’s Botswana, has been named Omicron.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X