కరోనా పూర్తిగా అంతమయ్యే అవకాశం తక్కువే .. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి సంచలనం
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటికి నిన్న గాలి ద్వారా కరోన వ్యాపిస్తుంది అనే విషయాన్ని నిర్ధారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ రెస్టారెంట్లు, జిమ్ లు , జన సమూహం ఎక్కువగా ఉన్న వెంటిలేషన్ లేని రద్దీ ప్రాంతాలలో గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పి ప్రపంచం డేంజర్ జోన్ లో ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ రయాన్ షాకింగ్ వ్యాఖ్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ రయాన్ కరోనా మహమ్మారి గురించి షాకింగ్ కామెంట్ చేశారు. కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే అవకాశం తక్కువని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ద్వారా, కరోనా విజృంభణ కొంతమేరకు అదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో లాక్ డౌన్ విధించే పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చని ఆయన అన్నారు. జెనీవా నుండి ఆన్ లైన్ బ్రీఫింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు . అయితే కరోనా వైరస్ ఇప్పట్లో అంతం కాదు అన్న ఆయన వ్యాఖ్యలతో ప్రపంచానికి భయం పట్టుకుంది.

వ్యాక్సిన్ తయారీ ఇప్పట్లో లేనట్టే
మరో పక్క కరోనా వ్యాక్సిన్ తయారీకి యుద్ధప్రాతిపదికన ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నా ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇండియాలో 2021 లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్, జైడస్ లు క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించాయని ఐసీఎంఆర్ ప్రకటించినా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మాత్రం అది సాధ్యం కాదని పేర్కొంటుంది.

గాలి ద్వారా కూడా వస్తుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
బెంగళూరుకు చెందిన ఐఎఎస్సి విడుదల చేసిన ప్రకటన ఆగస్టు 15,వరకువ్యాక్సిన్ వస్తుందని ఐ సి ఎం ఆర్ చెబుతున్నకాలక్రమం సమంజసమైనది కాదనిఅంటోంది.దీంతోవ్యాక్సిన్ ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ లేక, గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని చెబుతున్న నేపథ్యంలో ప్రపంచంలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారయింది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి పూర్తిగా అంతం అయ్యే అవకాశం చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి వెల్లడించడం మరింత ఆందోళనకు కారణం అవుతుంది.
Recommended Video

రోజుకో కొత్త విషయం వెలుగులోకి .. డేంజర్ జోన్ లో ప్రపంచం
రోజుకో కొత్త విషయం బాటకు రావటం , రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరగటంతో పాటు వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటం , ఆరోగ్య రక్షణలో అన్ని దేశాలు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ప్రపంచమే డేంజర్ జోన్ లో పడి విలవిలలాడుతుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications