కరోనా తగ్గినా దశాబ్దాల పాటు ప్రభావం- WHO తాజా హెచ్చరికలు- ఇంకా ఏం చెప్పిందంటే ?
ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ డబ్ల్యూహెచ్ఓ ఇవాళ కీలక హెచ్చరికలు చేసింది. కరోనా ప్రభావంతో పాటు వ్యాక్సినేషన్ అసమానత్వంపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ గేబ్రేసస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటిపై ఇప్పుడు పలు దేశాల్లో చర్చ జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి మందగిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావం దశాబ్దాలుగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ ప్రభావం అత్యంత హాని కలిగించే సమూహాలలో కనిపిస్తుందని, అలాగే ఈ మహమ్మారి ఎక్కువ కాలం ఉంటే దాని ప్రభావం మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం దశాబ్దాలుగా ఉంటుందని, ముఖ్యంగా అత్యంత హాని కలిగించే సమూహాలలో ఇది మరింత ఎక్కువని ఆయన వెల్లడించారు. మహమ్మారి ఎంత ఎక్కువ కాలం ఉంటే ఆ ప్రభావాలు అంత అధ్వాన్నంగా ఉంటాయని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. ప్రస్తుతం కామన్వెల్త్ దేశాల జనాభాలో 42 శాతం మంది మాత్రమే రెట్టింపు మోతాదులో వ్యాక్సినేషన్‌ను పొందుతున్నారని, మిగతా దేశాల మధ్య చాలా అసమానత ఉందని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

గతంలో వైరస్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చెందాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరికలు జారీ చేసింది. సార్స్-కోవీ2 వైవిధ్యాలు గత వేరియంట్‌లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ల ద్వారా ప్రేరేపించబడిన న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ నుండి తప్పించుకోవచ్చని టెడ్రోస్ వెల్లడించారు. బీటా కరోనా వైరస్ ల రిజర్వాయర్ పెద్దదని, దీని నుంచి కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్ధ హెచ్చరికలపై శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications