• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews
సంస్థలు ఉద్యోగులకిచ్చే జీతాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?

ఒక అభ్యర్థి ఉద్యోగంలో చేరేందుకు జీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ చాలా సంస్థలు ఉద్యోగికిచ్చే జీతమెంతో బహిరంగంగా చెప్పవు.

మీకు నచ్చిన ఉద్యోగ ప్రకటన లింక్డిన్‌లో కనిపించింది. ఆ ఉద్యోగం గురించి రాసిన వివరాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీకుంటాయి.

కానీ, జీతం విషయం వచ్చేసరికి మాత్రం మీ ఉద్యోగానుభవం లేదా పోటీకి అనుగుణంగా వేతనం ఉంటుందని కనిపిస్తుంది.

సంస్థలిచ్చే జీతాన్ని ప్రకటనల్లో ఎందుకు చెప్పరు?

"సంప్రదాయ కార్పొరేట్ వాతావరణంలో సాధారణంగా ఉద్యోగులకిచ్చే జీతాన్ని రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే, అభ్యర్థికి ప్రస్తుతం వస్తున్న జీతం గురించి తెలుసుకుంటూ, వారి అంచనాలను తెలుసుకుని, సంస్థ ఎంత ఇవ్వాలని అనుకుంటుందో నిర్ణయించుకునేందుకు పిల్లి, ఎలుక మధ్య జరిగే ఆటలా ఉంటుంది" అని యూకే ప్రాపర్టీ టెక్నాలజీ సంస్థ 'వి మెయింటైన్' మేనేజింగ్ డైరెక్టర్ టామ్ హార్మ్స్‌వర్థ్ చెప్పారు.

జీతం గురించి ముందుగా చెప్పకపోవడం చాలామంది ఉద్యోగులను బాధపెడుతోంది.

జీతం గురించి ముందుగానే తెలియడం వల్ల ఆ ఉద్యోగం ఆర్థికంగా తమకు అనుకూలంగా ఉంటుందో లేదో అభ్యర్థి నిర్ణయించుకునే వీలుంటుంది.

దీనివల్ల ఉద్యోగ నియామకం సమయంలో జరిగే చర్చను అర్థవంతం చేస్తుంది.

ఉద్యోగంలో చేరడానికి వేతనం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని 2018లో లింక్డిన్ నిర్వహించిన సర్వేలో 61శాతం మంది చెప్పారు. గ్లాస్ డోర్ నిర్వహించిన సర్వే కూడా ఇలాంటి ఫలితాలనే వెల్లడించింది.

కానీ, ప్రస్తుతం సంస్థలో పని చేసే సిబ్బందికి ఆగ్రహం తెప్పిస్తుందేమోననే భయంతో లేదా మార్కెట్‌లో పోటీకి భయపడి చాలా సంస్థలు ఉద్యోగ ప్రకటనల్లో వేతన వివరాలను చేర్చరు.

కానీ, వేతన వివరాలను ఒక నియమంలా కాకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంచేలా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం మొదలవుతోంది.

వేతనాల గురించి బహిరంగంగా ప్రకటించే సంస్థలు ఉత్తమమైన, మెరుగైన ఉద్యోగులను పొందే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. సమానత్వంతో కూడిన పని స్థలాలను సృష్టించడానికి వేతనాలలో పారదర్శకత అవసరం.

ప్రపంచ వ్యాప్తంగా 12.6 శాతం మాత్రమే తామిచ్చే వేతన పరిమితిని తమ ఉద్యోగ ప్రకటనలతో పాటు ప్రచురించాయని పే స్కేల్ 2021లో విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా కేవలం 12.6శాతం సంస్థలు మాత్రమే తామిచ్చే వేతన పరిమితిని తమ ఉద్యోగ ప్రకటనలతో పాటు ప్రచురించాయని పే స్కేల్ 2021లో విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

"సిబ్బందికి ఆగ్రహం తెప్పిస్తామేమోననే భయంతో వేతనాల గురించి ప్రచురించడానికి తమ సంస్థలు ఇష్టపడవు" అని కెనడా క్వీన్స్ యూనివర్సిటీ బిజినెస్ ప్రొఫెసర్ ఎడ్డీ ఎన్‌జి చెప్పారు .

ఆదర్శప్రాయమైన ప్రపంచంలో, ఒకేరకమైన ఉద్యోగం చేసేవారందరికీ ఒకేలాంటి జీతం రావాలి. కానీ, అన్నిసార్లూ అలా జరగదు. కొన్ని మార్కెట్లలో, కొంతమంది యజమానులు ఉత్తమమైన టాలెంట్‌ను ఆకర్షించేందుకు ఎక్కువ జీతాలివ్వాలని అనుకుంటారు.

దీంతో అప్పటికే సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో ఘర్షణ ఏర్పడుతుంది. ముఖ్యంగా చాలా తక్కువ జీతానికి పనిలో చేరిన వారికి ఈ ఇబ్బంది ఎదురవుతుంది.

"వేతనాలను బహిరంగంగా ప్రకటించడం వల్ల మార్కెట్‌లో సంస్థల పోటీదారులు తమ ఉద్యోగులను సులభంగా తమ సంస్థల్లోకి లాక్కునే అవకాశం ఉంటుంది" అని ఎడ్డీ అన్నారు.

ఈ సమాచారాన్ని ఉపయోగించి మార్కెట్‌లో పోటీ పడి ఉత్తమమైన అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

"వేతనాలను వ్యక్తిగతంగా ఉంచడం ద్వారా సంస్థను రక్షించి, సంస్థ యాజమాన్యం తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది" అని అన్నారు.

చాలా సంస్థల యాజమాన్యాలు జీతాల వివరాలను బయటపెట్టకుండా ఉండటం వల్ల సామర్ధ్యమున్న అభ్యర్థులతో జీతం గురించి మరింత చర్చించే అవకాశం కలుగుతుంది.

అలాగే, అభ్యర్థి నివసిస్తున్న ప్రదేశం గ్రామీణ ప్రాంతమా లేదా నగర ప్రాంతమా అని పరిశీలించి కూడా జీతాన్ని నిర్ణయిస్తారు.

దీంతో డబ్బును ఆదా చేసేందుకు సంస్థ యాజమాన్యాలకు వీలు కలుగుతుంది.

వేతన పరిధిని ప్రకటించడం ద్వారా సంస్థలో పని చేసే సిబ్బంది అంతా ప్రకటించిన పరిధిలో అత్యధిక స్థాయి జీతాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. ఆ పరిధిలో కనిష్ఠ స్థాయిలో జీతం తీసుకోవడం, దానిని ఆమోదించడం ఉద్యోగుల్లో నిరాసక్తతను పెంచుతుంది.

ఒక పద్ధతి ప్రకారం వేతనాలను నిర్ణయించని సంస్థలే జీతం వివరాలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడుతున్నాయని పే స్కేల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ షెల్లీ హోల్ట్ అన్నారు.

అయితే, కొన్నిసంస్థలు తామిచ్చే జీతాలను దాచిపెట్టినప్పటికీ.. వేతనాలను బహిరంగంగా చెప్పే విషయంలో కూడా పోటీ మొదలవుతుందని హోల్ట్ అన్నారు.

జీతాల విషయంలో పారదర్శకంగా ఉండే సంస్థలు ఉత్తమ అభ్యర్థులను ఆకర్షించేందుకు, ఉద్యోగులను పొందేందుకు అవకాశం ఉంటుంది.

"జీతాల గురించి బహిరంగంగా ప్రకటించడం సంస్థ పారదర్శకతకు అద్దం పడుతుంది" అని వి మెయింటైన్‌కు చెందిన హార్మ్స్‌వర్థ్ అన్నారు.

వి మెయింటైన్ కూడా జీతాల విషయంలో పారదర్శకతతో వ్యవహరించేందుకు ముందడుగు వేస్తోంది.

గతేడాది చివర్లో ఈ సంస్థ సుమారు 100మంది ఉద్యోగుల వేతనాన్ని అందరితో సమానంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంది.

కొన్నేళ్లుగా పురుషాధిపత్యంతో ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో జెండర్ పే వ్యత్యాసాన్ని తొలగించేందుకు, మరింత మంది మహిళా అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ ఏడాది అన్ని ఉద్యోగాలకూ జీతాల పరిధిని కూడా ప్రకటించింది.

సంస్థలు ఉద్యోగులకిచ్చే జీతాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?

ఈ చర్యలన్నీ తమ సంస్థకు లాభాలను తెచ్చి పెట్టాయని హార్మ్స్‌వర్థ్ చెప్పారు.

ఈ చర్యల వల్ల మరింత మంది మహిళా అభ్యర్థులు రావడం మొదలయినట్లు తెలిపారు.

"భిన్నత్వం, సమానత్వం, అన్ని వర్గాల వారినీ సమ్మిళితం చేసుకునే విషయాల్లో సీరియస్‌గా ఉన్న మేనేజర్లు తమ సంస్ధలిచ్చే ఉద్యోగ ప్రకటనలను మరోసారి పరిశీలించాలి" అని ఎడ్డీ అన్నారు.

ఇది సంస్థ పట్ల నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు.

"జెండర్ పే గ్యాప్‌ను సరి చేసేందుకు కూడా ఇది సహాయపడుతుంది" అని హోల్ట్ అన్నారు.

"వేతన పారదర్శకతను పెంచడం ద్వారా, మార్కెట్ పని చేసే తీరును మార్చే అవకాశం ఉంది" అని హోల్ట్ అంటారు.

వినూత్నంగా ఆలోచించే సంస్థలు ఇటువంటి చర్యలను మరింత ముందుకు తీసుకుని వెళతాయని అన్నారు.

వేతన పారదర్శకత గురించి విస్తృతమైన ట్రెండ్ సాగుతోంది.

ఉదాహరణకు లాట్వియాలో 2019లో అమలులోకి వచ్చిన కొత్త చట్టం సంస్థలు ఇచ్చే వేతనాలను అన్ని ఉద్యోగ ప్రకటనలపైనా ప్రచురించడం తప్పనిసరి చేసింది.

లాట్వియా తరహా చట్టాన్ని అమెరికాలో మొదటిసారిగా కొలరాడో రాష్ట్రం అమలులోకి తెచ్చింది.

సంస్థల యాజమాన్యాలు ప్రతి గంటకు సిబ్బందికి చెల్లించే వేతనాన్ని కానీ, వేతన పరిధిని కానీ ప్రకటనల్లో ప్రచురించడాన్ని తప్పనిసరి చేసింది.

ఈ చట్టాన్ని ఉల్లఘించిన పక్షంలో మూడున్నర లక్షల రూపాయల నుంచి ఏడున్నర లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటుంది.

అమెరికాలో మరిన్ని రాష్ట్రాలు కొలరాడోను అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే, వేతనాల గురించి తెలియచేయడం యాజమాన్యాలకు, ఉద్యోగులకు కూడా లాభమేనని సాఫ్ట్‌వేర్ సంస్థ డెస్క్ టైమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ టామ్స్ బ్లాడ్ నీక్స్ చెప్పారు.

"ఇలా చేయడం వల్ల ఉద్యోగులు కృతజ్ఞతా భావంతో ఉంటారు" అని చెప్పారు.

అలాగే, మేమెంత జీతాలివ్వాలనే విషయంలో అభ్యర్థుల రెజ్యుమ్‌లు తిరగేస్తూ మేము కూడా సమయాన్ని వృధా చేసుకునే పని ఉండదు" అని అన్నారు.

ఇలాంటి చర్యలన్నీ వేతనం అంశాన్ని కొత్త కోణంలో చూసేందుకు వ్యాపార సంస్థలపై ఒత్తిడి తెస్తున్నాయి.

అయితే, ఈ చర్యలు పాటించడానికి సమయం పడుతుందని హోల్ట్ భావిస్తున్నారు. కానీ, మార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు.

"దీనిని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ముఖ్యంగా భిన్నత్వం, సమానత్వం, అన్ని వర్గాల వారినీ సమ్మిళిత పరుచుకునే విషయంలో కొన్ని సామాజిక ఒత్తిళ్లు కూడా ఉంటాయి" అని ఆమె వివరించారు.

"మార్కెట్ మారుతోంది. ఎప్పటి నుంచో చేస్తున్నట్లు పనులను చేయడం సంస్థలు ముందుకు వెళ్లేందుకు ఏ విధంగానూ ఉపయోగపడదు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Jobs, employees salary, ఉద్యోగులు, ఉద్యోగుల జీతాలు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X